Share News

ఆఫ్‌లైన్‌ లేఅవుట్‌లకు మోక్షం

ABN , Publish Date - Apr 23 , 2025 | 12:54 AM

నగరాలు, పట్టణాల్లో ఆఫ్‌లైన్‌ (మాన్యువల్‌) విధానం లో అనుమతులు తీసుకున్న లే–అవుట్‌ల్లో పనులు పూర్తి చేయని వాటిని తిరిగి పునరుద్ధరించుకోవడానికి రియ ల్టర్లకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీనివల్ల పుర పాలక, కార్పొరేషన్లకు ఆదాయం సమకూరనుంది.

ఆఫ్‌లైన్‌ లేఅవుట్‌లకు మోక్షం

స్థానిక సంస్థలకు సమకూరనున్న ఆదాయం

పాత ఫైళ్లకు బూజులు దులిపే పనుల్లో టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది

మార్కెట్‌ ఫీజులో 50 శాతం చెల్లించి పునరుద్ధరణకు అవకాశం

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

నగరాలు, పట్టణాల్లో ఆఫ్‌లైన్‌ (మాన్యువల్‌) విధానం లో అనుమతులు తీసుకున్న లే–అవుట్‌ల్లో పనులు పూర్తి చేయని వాటిని తిరిగి పునరుద్ధరించుకోవడానికి రియ ల్టర్లకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీనివల్ల పుర పాలక, కార్పొరేషన్లకు ఆదాయం సమకూరనుంది. 2018కు ముందు లే–అవుట్లు మంజూరు పొందిన రియల్టర్లు అక్కడ లే–అవుట్లు వేశాక ఎటువంటి సౌకర్యాలు కల్పించ కుండా కాల పరిమితి ముగిసిన వాటిని మార్కెట్‌ ఫీజులో 50 శాతం చెల్లించి తాజాగా పునరుద్ధరణకు అర్బన్‌ డెవ లప్‌మెంట్‌ అఽఽథారిటీలకు అవకాశం కల్పించారు. జాప్యం జరిగిన సంవత్సరాలకు గడువు పూర్తయిన తర్వాత కాలాన్ని పరిగణనలోకి తీసుకుని ఆలస్యపు ఫీజు వసూలు చేసి వాటికి అనుమతిలిస్తారు. ప్రస్తుత కరెంట్‌ గెజిట్‌ రేట్స్‌ వసూళ్లు చేస్తారు. రియల్టర్లు నుంచి వచ్చిన విజ్ఞప్తులతో పాటు టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ డైరెక్టర్‌ ప్రతిపాదించిన అంశాలను, చేయాల్సిన లే–అవుట్లపై పురపాలకశాఖ ద్వారా ప్రభుత్వానికి నివేదించగా, ఈ ప్రక్రియకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. గతంలో వైసీపీ ప్రభుత్వం లే–అవుట్ల వ్యవహారంలో భారీ ఫీజులు వసూళ్లకు పాల్పడడం, భూ మార్పిడి ఫీజును 3 శాతం నుంచి 5 శాతం వసూలు చేయడం వల్ల రియల్టర్లు ఆశలు వదిలేసుకున్నారు. ప్రభుత్వం తాజాగా ఇచ్చిన రీవ్యాలిడేషన్‌ ప్రక్రియతో పాత రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలకు కొంత ఊరట లభించినట్లే. జిల్లా కేంద్రమైన ఏలూరు విషయా నికి వస్తే ఏడు గ్రామ పంచాయతీలు విలీనం కావడంతో.. అక్కడ నిలిచిన లే–అవుట్లపై ఆదా యం సమకూరనుంది. కొత్తగా చింతలపూడి, జంగారెడ్డిగూడెంలకు ఆదాయం సమకూ ర నుంది. నూజివీడు కాస్తోకూస్తో ఆదాయం లభించనుంది. ఇక్కడ మామిడి పొలా లను నరికేసి లే–అవుట్లను వేశారు.

పాత వాటికి బూజులు దులపాల్సిందే..

దాదాపుగా ఏడేళ్ల క్రితమే లే–అవుట్లు మంజూరులు పొందిన వారి ఫైళ్లను పురపాలక సంఘాల్లో పాత వాటికి బూజులు దులపాల్సి వచ్చింది. అవి ఎక్కడున్నాయో వెతికే పనుల్లో అధికారులు నిమగ్నం అయ్యారు. పాత పాలకవర్గాలు అటు,ఇటూ మారడం, అప్పటి అధికారులు ఇక్కడ పనిచేయకపోవడంతో పాత పైళ్లపై కమిషనర్లే ప్రత్యేక చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై త్వరలోనే జిల్లా స్థాయిల్లోను అర్బన్‌ అథారిటీ స్థాయిలో, రాజమండ్రి టౌన్‌అండ్‌ కంట్రీప్లానింగ్‌ రీజినల్‌ డైరక్టర్‌ పరిధిలోను రియల్లర్లతో సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ఇది మున్సిపాల్టీలకు, కార్పొరేషన్‌లో విలీనమైన పంచాయ తీలకు ఉపయోగంగా ఉంటుందని, రియల్టర్లు ఆలస్యం రుసుంతో పాత వాటిని పునరుద్ధరించుకోవడానికి ముందుకు రావాలని టౌన్‌అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ రీజనల్‌ డైరెక్టర్‌ పి.శ్రీనివాసమూర్తి కోరారు. ఆయా మున్సిపాల్టీలు, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఆఽథారిటీలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆయన సూచించారు.

Updated Date - Apr 23 , 2025 | 12:54 AM