Share News

ఇళ్ల తొలగింపులో ఉద్రిక్తత

ABN , Publish Date - Apr 18 , 2025 | 12:15 AM

బొండాడ గ్రామంలో ప్రభుత్వ పోరంబోకు స్థలాల్లో 28 ఇళ్ల తొలగింపు గురువారం చేపట్టారు.

ఇళ్ల తొలగింపులో ఉద్రిక్తత
బొండాడలో ప్రభుత్వ పోరంబోకు స్థలాల్లో ఇళ్ల తొలగింపు పనులు

కాళ్ళ, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): బొండాడ గ్రామంలో ప్రభుత్వ పోరంబోకు స్థలాల్లో 28 ఇళ్ల తొలగింపు గురువారం చేపట్టారు. అడ్డుకున్న సీపీఎం మండల కార్యదర్శి గొర్ల రామకృష్ణ అరెస్ట్‌కు పోలీసులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆకివీడు సీఐ జగదీశ్వరరావు, కాళ్ళ, ఆకివీడు, భీమవరం రూరల్‌ ఎస్‌ఐలు, పోలీసులు చు ట్టుముట్టారు. సుమారు 3 గంటల హైడ్రామా తర్వాత రామకృష్ణను అదుపులోకి తీసుకుని దగ్గరుండి కూల్చివేత ప్రారంభించారు. బాధితులు మాట్లాడుతూ ప్రత్యామ్నాయం చూపకుండా జేసీబీలతో కూల్చడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలతో పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Apr 18 , 2025 | 12:15 AM