Share News

నేర పరిశోధనలో పశ్చిమ పోలీసులు ప్రథమం

ABN , Publish Date - Apr 17 , 2025 | 12:02 AM

నేర పరిశోధనలో పశ్చిమ గోదా వరి జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి నేతృత్వంలో జిల్లా పోలీసులు రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచారు.

నేర పరిశోధనలో పశ్చిమ పోలీసులు ప్రథమం
డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్త నుంచి పురస్కారం అందుకుంటున్న పశ్చిమ పోలీసు అధికారులు

ఎస్పీ, సిబ్బందికి ప్రతిష్టాత్మక ఏబీసీడీ అవార్డు

భీమవరం క్రైం, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): నేర పరిశోధనలో పశ్చిమ గోదా వరి జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి నేతృత్వంలో జిల్లా పోలీసులు రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉండి మండలం యండగండిలో పార్శిల్‌ పేరిట మృతదేహం బట్వాడా కేసును స్వల్ప కాలంలో ఛేదించడం ఉన్నతాధికారులు అభినందించారు. డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్త నుంచి ప్రతిష్టాత్మక ఏబీసీడీ (అవార్డ్‌ ఫర్‌ బెస్ట్‌ క్రైం డిటెక్షన్‌) అవార్డును జిల్లా పోలీసు అధికారులు అందుకున్నారు. ఏఎస్పీ వి.భీమారావు, భీమవరం డీఎస్పీ రావూరి గణేశ్‌ జయసూర్య, ఆకివీడు సీఐ వి.జగదీశ్వరరావు, భీమవరం టూటౌన్‌ సీఐ జి.కాళీచరణ్‌, ఉండి ఎస్‌ఐ ఎండి. నజీరుల్లా, కాళ్ళ ఎస్‌ఐ ఎన్‌.శ్రీనివాసరావు, ఆచంట ఎస్‌ఐ కె.వెంకటరమణ, భీమవరం టూటౌన్‌ ఎస్‌ఐ రెహ్మాన్‌ అవార్డులు అందుకున్నారు. నేర పరిశోధన, నేరస్తులను గుర్తించడం లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఆచంట ఎస్‌ఐ వెంకట రమణ డీజీపీ నుంచి అవార్డు అందుకోవడంపై పలువురు అభినందించారు.

ఉండి మండలం యండగండి గ్రామానికి చెందిన ముదునూరి రంగరాజు కుమార్తెలు సాగి తులసికి మృతదేహాన్ని పార్సిల్‌గా పంపిం చిన కేసును ఛేదించడం ద్వారా పోలీసు శాఖ గౌరవం ఇనుమడించిందని ఎస్‌ఐ నజీరుల్లా తెలిపారు. ఈ కేసులో నేరస్థుడు చిన్న అల్లుడు సుధీర్‌వర్మను సిబ్బంది సహకారంతో స్వల్ప కాలంలో పట్టుకున్నట్లు గుర్తు చేసుకున్నారు.

Updated Date - Apr 17 , 2025 | 12:02 AM