Share News

YS Sharmila: జగన్‌ మౌనం... మోదీకి మద్దతివ్వడమే

ABN , Publish Date - Mar 23 , 2025 | 04:39 AM

నియోజకవర్గాల పునర్విభజనపై జగన్‌ మౌనం మోదీకి మద్దత్తు ఇవ్వడమేననా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు.

 YS Sharmila: జగన్‌ మౌనం... మోదీకి మద్దతివ్వడమే

డీలిమిటేషన్‌పై చంద్రబాబు,పవన్‌ మాట్లాడాలి: వైఎస్‌ షర్మిల

అమరావతి, మార్చి 22(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాల పునర్విభజనపై జగన్‌ మౌనం మోదీకి మద్దత్తు ఇవ్వడమేననా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. డీలిమిటేషన్‌పై శనివారం ఆమె ఎక్స్‌లో స్పందించారు. జనాభా పాత్రిపదికన జరిగే డీలిమిటెషన్‌ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు జరిగే తీవ్ర అన్యాయంపై ఆమె లెక్కలతో సహా వివరించారు. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాల పోరాటానికి ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని చెప్పారు. ఐక్యంగా పోరాటం చేస్తే తప్ప నియంత ప్రధాని నరేంద్ర మోదీకి బుద్ధి రాదని వ్యాఖ్యానించారు. ఏపీలో మోదీ పక్షం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ మౌనం వహించడం రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహనరెడ్డి కూడా నోరు మెదపక పోవడం అంటే... పరోక్షంగా డీలిమిటేషన్‌కు మద్దతును ప్రకటించినట్లేనని వ్యాఖ్యానించారు. రాజకీయాలు పక్కనపెట్టి టీడీపీ, జనసేన, వైసీపీ ముందుకు రావాలని షర్మిల డిమాండ్‌ చేశారు.

Updated Date - Mar 23 , 2025 | 04:39 AM