Share News

ఏడాదిలో రూ.77.6 లక్షల కోట్లు

ABN , Publish Date - Jan 01 , 2025 | 06:19 AM

ఈక్విటీ మార్కెట్‌ 2024 సంవత్సరం మొత్తం తీవ్ర ఆటుపోట్లలో ప్రయాణించినా చివరికి ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించింది. కొంత కాలం బుల్‌ రన్‌, మరి కొంత కాలం బేర్‌ పట్టుతో ఈ ఏడాదిలో మార్కెట్‌ పయనం సాగింది. అప్పుడప్పుడూ...

ఏడాదిలో రూ.77.6 లక్షల కోట్లు

ఆటుపోట్లలోనూ స్టాక్‌ మార్కెట్‌ లాభాల పంట

స్వల్ప నష్టంతో 2024కి సెన్సెక్స్‌ వీడ్కోలు

ముంబై: ఈక్విటీ మార్కెట్‌ 2024 సంవత్సరం మొత్తం తీవ్ర ఆటుపోట్లలో ప్రయాణించినా చివరికి ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించింది. కొంత కాలం బుల్‌ రన్‌, మరి కొంత కాలం బేర్‌ పట్టుతో ఈ ఏడాదిలో మార్కెట్‌ పయనం సాగింది. అప్పుడప్పుడూ ఆటుపోట్లు ఏర్పడినా స్థూలంగా ఆశావహ దృక్పథం మార్కెట్‌ పయనాన్ని నిర్దేశించింది. ఏడాది మొత్తం మీద ఈక్విటీ మార్కెట్‌ పెట్టుబడులకు దిక్సూచిగా భావించే సెన్సెక్స్‌ 5898.75 పాయింట్లు (8.16ు) లాభపడగా, నిఫ్టీ 1913.40 పాయింట్లు (8.80ు) లాభపడింది. సెప్టెంబరు 27వ తేదీన సెన్సెక్స్‌ జీవితకాల గరిష్ఠ స్థాయి 85,978.25 పాయింట్లను తాకగా నిఫ్టీ 26,277.35 పాయింట్ల రికార్డును నమోదు చేసింది. నిఫ్టీ సానుకూల రాబడులు అందించడం ఇది వరుసగా తొమ్మిదో సంవత్సరం అని మెహతా ఈక్విటీస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రశాంత్‌ తాప్సే చెప్పారు. కాగా బీఎ్‌సఈ స్మాల్‌క్యాప్‌ సూచీ 12,506.84 పాయింట్లు (29.30ు), మిడ్‌క్యాప్‌ సూచీ 9,605.44 పాయిం ట్లు (26.07ు) లాభపడ్డాయి. ఏడాదిలో మొత్తం మీద ఇన్వెస్టర్ల సంపద లేదా బీఎ్‌సఈలో లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ రూ.77,66,260.19 కోట్లు పెరిగి రూ.4,41,95,106.44 కోట్ల (5.16లక్షల కోట్ల డాలర్లు) వద్ద స్థిరపడింది. ఏప్రిల్‌ 8వ తేదీన ఇన్వెస్టర్ల సంపద తొలిసారిగా 400 లక్షల కోట్ల మైలురాయిని తాకింది.


బుల్‌, బేర్‌ నువ్వా..నేనా..?

ఏడాది మొత్తం మీద బుల్‌, బేర్‌ నువ్వా, నేనా అన్నట్టు పోరాడాయని విశ్లేషకులంటున్నారు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న అస్థిరతలు మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. జనవరి నుంచి సెప్టెంబరు నెలల మధ్య కాలంలో మార్కెట్‌పై బుల్‌ పట్టు కొనసాగగా ఆ తర్వాత బేర్‌ గుప్పిట్లోకి వెళ్లిందని చెబుతున్నారు. ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల నడుమ భారత మార్కెట్‌పై కన్సాలిడేషన్‌ ఒత్తిడి అధికంగా ఉందంటున్నారు.

నష్టాలతో ముగింపు: మార్కెట్‌ 2024 సంవత్సరం చివరి రోజున నష్టాలతో ముగిసింది. ప్రపంచ మార్కెట్ల బలహీన సంకేతాలు, విదేశీ నిధుల తరలింపు నేపథ్యంలో భారీ ఆటుపోట్లకు గురయింది. అమ్మకాల ప్రభావంతో ఇంట్రాడేలో 687.34 పాయింట్లు నష్టపోయి 77,560.79 కనిష్ఠ స్థాయిని తాకిన సెన్సెక్స్‌ చివరికి నష్టాన్ని 109.12 పాయింట్లకు పరిమి తం చేసుకుని 78,139.01 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ మాత్రం 0.10 పాయింట్ల నామమాత్రపు నష్టంతో 23,644.80 వద్ద ఫ్లాట్‌గా ముగిసింది.


రూపాయి 3%: డౌన్‌

ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి ఏడాది మొత్తం మీద 3ు నష్టపోయింది. మంగళవారం డాలర్‌ మారకంలో రూపాయి 12 పైసలు నష్టపోయి జీవితకాల కనిష్ఠ స్థాయి 85.64కి పడిపోయింది. కాగా 2023 డిసెంబరు 29వ తేదీన డాలర్‌ మారకంలో రూపాయి 83.16 వద్ద ఉండగా మంగళవారం (2024 డిసెంబరు 31) 85.64 వద్ద క్లోజైంది. రూపాయి అక్టోబరు 10 వ తేదీన కీలకమైన 84 స్థాయిని, డిసెంబరు 19వ తేదీన 85 స్థాయిని బ్రేక్‌ చేసింది. డిసెంబరు 27వ తేదీన ఇంట్రాడేలో జీవితకాల కనిష్ఠ స్థాయి 85.80ని తాకింది.

Updated Date - Jan 01 , 2025 | 06:52 AM