అగ్రిటెక్‌లో 80,000 కొలువులు
ABN , Publish Date - Jan 02 , 2025 | 05:40 AM
అగ్రిటెక్ రంగంలోనూ పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయి. వచ్చే ఐదేళ్లలో ఈ రంగం లో ఎంత లేదన్నా 60,000 నుంచి 80,000 కొత్త ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని టీమ్‌లీజ్ సర్వీసెస్...
టీమ్‌లీజ్ సర్వీసెస్
ముంబై: అగ్రిటెక్ రంగంలోనూ పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయి. వచ్చే ఐదేళ్లలో ఈ రంగం లో ఎంత లేదన్నా 60,000 నుంచి 80,000 కొత్త ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని టీమ్‌లీజ్ సర్వీసెస్ అంచనా వేసింది. అధునాతన పద్దతుల్లో పొలాలకు నీటిపారుదల సదుపాయాల కల్పన, ఎరువులు, పురుగు మందుల పిచికారీ, అధునాతన వ్యవసాయ యంత్రాలు, వ్యవసా య ఉత్పత్తుల అమ్మకం కోసం ఏర్పాటు చేసే మార్కెటింగ్ సదుపాయాలతో ఈ ఉద్యోగాల కల్పన ఉంటుందని టీమ్‌లీజ్ సర్వీసెస్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ సబ్బురత్నం తెలిపారు. దేశ వ్యవసాయ రంగం ఇప్పటికే దాదాపు లక్ష మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.