ACE Micromatic Group : ఐఎంటీఎంఏతో ఏస్ మైక్రోమాటిక్ జట్టు
ABN , Publish Date - Jan 11 , 2025 | 03:40 AM
ఇండియన్ మెషిన్ టూల్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఐఎంటీఎంఏ)తో ఏస్ మైక్రోమాటిక్ గ్రూప్‌తో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది.
బెంగళూరు (ఆంధ్రజ్యోతి): ఇండియన్ మెషిన్ టూల్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఐఎంటీఎంఏ)తో ఏస్ మైక్రోమాటిక్ గ్రూప్‌తో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఐఎంటీఎంఏ డైరెక్టర్ జనరల్, సీఈఓ జిబాక్ దాస్‌గుప్తా, ఏస్ మైక్రోమాటిక్ డిజైనర్స్ ఎండీ టీకే రమేష్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. తయారీ రంగంలో ఉత్పాదకతను పెంచేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని ఇరు సంస్థలు ప్రకటించాయి. కాగా 2015 నుంచి ఈ రెండు సంస్థలు సంయుక్తంగా నేషనల్ ప్రొడక్టివిటీ సమ్మిట్‌ను నిర్వహిస్తూ వస్తున్నాయి. తాజాగా ఈ భాగస్వామ్యాన్ని 2025 నుంచి మరో ఐదేళ్ల పాటు కొనసాగించనున్నాయి. ఒప్పందంలో భాగంగా ఈ సమ్మిట్‌కు ఏస్ మైక్రోమాటిక్ గ్రూప్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. రానున్న సంవత్సరాల్లో నేషనల్ ప్రొడక్టివిటీ సమ్మిట్‌కు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ఈ ఒప్పందం ఎంతగానో దోహదపడుతుందని ఐఎంటీఎంఏ ప్రెసిడెంట్ ఎస్ రాజమనే అన్నారు.