Apple iPhone SE 4: ఐఫోన్ ఎస్‌ఈ 4పై పెరుగుతున్న ఆసక్తి.. రిలీజ్, ధర, ఇతర వివరాలు ఇవేనా?
ABN , Publish Date - Feb 19 , 2025 | 02:36 PM
ప్రస్తుతం పల్లెటూళ్లలో కూడా ఐఫోన్లు వాడే వాళ్లు కనబడుతున్నారు. ఐఫోన్‌ను మరింత మందికి చేరువ చేసేందుకు యాపిల్ కంపెనీ మరిన్ని ప్రయత్నాలు చేస్తోంది. బడ్జెట్‌లో అందరికీ అందుబాటులో ఉండే ఎస్‌ఈ 4 వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది.

గతంలో ఆపిల్ ఫోన్ (iPhone) అంటే ధనవంతుల దగ్గర మాత్రమే ఉంటుందనే భ్రాంతి ఉండేది. అయితే ప్రస్తుతం చాలా మంది ఐఫోన్ యూజర్లుగా మారిపోయారు. పల్లెటూళ్లలో కూడా ఐఫోన్లు వాడే వాళ్లు కనబడుతున్నారు. ఐఫోన్‌ను మరింత మందికి చేరువ చేసేందుకు యాపిల్ కంపెనీ మరిన్ని ప్రయత్నాలు చేస్తోంది. బడ్జెట్‌లో అందరికీ అందుబాటులో ఉండే ఎస్‌ఈ 4 వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ రోజు (బుధవారం) రాత్రి 10.30 గంటలకు ఈ ఫోన్ విడుదల కావొచ్చని వార్తలు వస్తున్నాయి (Apple iPhone SE 4).
విపరీతమైన ఆసక్తి నెలకొనడంతో ఎస్‌ఈ 4 వెర్షన్‌కు సంబంధించి ఇప్పటికే పలు లీక్‌లు వచ్చాయి. 2022లో విడుదలైన ఎస్‌ఈ 3 వెర్షన్ టచ్ ఐడీతో ఉంటుంది. అయితే తాజాగా విడుదల కాబోతున్న ఎస్‌ఈ 4 వెర్షన్ ఇతర ఐఫోన్ల తరహాలోనే ఫేస్ ఐడీతో ఉంటుదని సమాచారం అలాగే 6.1 అంగుళాల ఓఎల్‌ఈడీ స్క్రీన్, యాపిల్ లేటెస్ట్ బయానిక్ చిప్ ఏ18తో రాబోతున్నట్టు సమాచారం. ఇక, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, 48 ఎంపీ బ్యాక్ కెమేరా, 12 ఎంపీ ఫ్రంట్ కెమేరా, 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఎస్‌ఈ 4 వెర్షన్‌లో అందుబాటులో ఉండబోతున్నట్టు సమాచారం (Apple iPhone SE 4 details).
ఐఫోన్ 15 నుంచి లైటినింగ్ కేబుల్ స్థానంలో టైప్-సి ఛార్జింగ్ సదుపాయాన్ని యాపిల్ అందిస్తోంది. ఈ ఎస్‌ఈ 4 వెర్షన్‌కు కూడా టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌నే ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇక, ధర విషయానికి వస్తే 2022లో ఎస్‌ఈ 3ని విడుదల చేసినపుడు దాని ధర రూ.43,999గా ప్రకటించారు. తాజా ఎస్‌ఈ 4 వెర్షన్ ధరను రూ.45 వేల నుంచి 50 వేల మధ్యలో నిర్ణయించవచ్చని వార్తలు వస్తున్నాయి. కాగా, ఈ మొబైల్ పేరును ఎస్‌ఈ 4 అని కాకుండా ఐఫోన్ 16ఈ (iPhone 16E) అని కూడా పెట్టవచ్చని కొందరు చెబుతున్నారు. ఏదేమైనా మరికొద్ది గంటల్లో పూర్తి వివరాలు బయటకు రాబోతున్నాయి.
మరిన్ని బిజినెెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..