Bank Holidays: నాలుగురోజులు నిలిచిపోనున్న బ్యాంకు సేవలు.. ఎందుకంటే
ABN , Publish Date - Mar 20 , 2025 | 10:54 AM
Bank Holidays: దేశ వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. దీంతో ప్రజలు ముందుగానే దగ్గర్లోని బ్యాంకు ఖాతాలకు వెళ్లి నగదు లావాదేవీలు చేసుకోవడం మంచిది.

Bank Holidays: బ్యాంకులు (Banks) వరుసగా నాలుగు రోజుల పాటు మూతపడనున్నాయి. వారాంతంతో పాటు బ్యాంకుల సమ్మె ఇందుకు కారణం. వచ్చే వారం దేశవ్యాప్తంగా బ్యాంకులు సమ్మెబాట పట్టనున్నాయి. తమ డిమాండ్ల పరిష్కారం కోసం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) సమ్మెకు పిలుపునిచ్చింది. మార్చి 23వ తేదీన అర్థరాత్రి నుంచి మార్చి 25 వరకు సమ్మె కొనసాగనుంది. దీంతో ఆ రెండు రోజుల పాటు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి.
డిమాండ్ల పరిష్కారం కోసం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA)తో జరిగిన చర్చలు విఫలమవడంతో సమ్మెకు పిలుపునిచ్చింది యూఎఫ్‌బీయూ. రెండు రోజుల పాటు బ్యాంకుల సమ్మెతో భారత ఆర్థిక రంగం స్తంభించిపోనుంది ఈ సమ్మెలో ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ బ్యాంకులతో పాటు ప్రాంతీయ, గ్రామీణ బ్యాంకు సిబ్బంది కూడా పాల్గొననున్నారు. అయితే వచ్చే వారంలో బ్యాంకుల సమ్మె అయినప్పటికీ ముందు నుంచే అంటే మార్చి 22 నుంచే బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. మార్చి 22న నాల్గవ శనివారం, తరువాత ఆదివారం బ్యాంకులకు సెలవులు. ఆపై మార్చి 24, 25 (సోమ, మంగళవారం) బ్యాంకుల సమ్మె నేపథ్యంలో దాదాపు నాలుగు రోజుల పాటు బ్యాంకు సేవలకు అంతరాయం కలుగనుంది.
Bill Gates Tweet: సహకారం కొనసాగిస్తాం.. ఏపీ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలపై బిల్ గేట్స్..
అందుబాటులో ఆన్‌లైన్ సేవలు..
బ్యాంకు సేవలు నిలిచిపోనున్నప్పటికీ ఆన్‌లైన్ సేవలు మాత్రం అందుబాటులో ఉండనున్నాయి. అలాగే ఏటీఎం సేవలు కూడా అందుబాటులో ఉంటాయని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. రెండు రోజుల పాటు సెలవులు, రెండు రోజుల పాటు సమ్మె కారణంగా నగదు లావాదేవీలు, చెల్లింపులు, అడ్బాన్సులు వంటి బ్యాంకింగ్ సేవలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకు సేవలకు అంతరాయం నేపథ్యంలో ప్రజలు ముందుగానే బ్యాంకులకు వెళ్లి నగదు లావాదేవీలు జరుపుకోవాల్సిన పరిస్థితి ఉంది.
యూఎప్‌బీయూ డిమాండ్లు ఇవే..
బ్యాంకుల అంతటా అన్ని ఉద్యోగ కేడర్లలో అవసరమైన మేరకు నియామకాలు చేపట్టాలి. తాత్కాలిక ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించడం, అన్ని బ్యాంకులకు ఐదు రోజుల పని దినాలను అమలు చేయడం, పనితీరు సమీక్షలను ఉపసంహరించుకోవడం, దాడుల నుంచి బ్యాంకు అధికారులు, సిబ్బందికి భద్రత కల్పించడం. గ్రాట్యుటీ చట్టాన్ని సవరించడం వంటి డిమాండ్లతో బ్యాంకులు సమ్మె బాట పడుతున్నాయి.
ఇవి కూడా చదవండి...
kamareddy Car Accident: పెట్రోలింగ్ చేస్తూ ఆగిన కానిస్టేబుళ్లు.. ఇంతలోనే ఊహించని ఘటన
Read Latest Business News And Telugu News