Share News

Celebrity Investments : ఓయో షేర్లపై బాలీవుడ్‌ సెలబ్రిటీల ఆసక్తి

ABN , Publish Date - Jan 13 , 2025 | 02:29 AM

రితేశ్‌ అగర్వాల్‌ స్థాపించిన ఓయో హోట ల్స్‌ అండ్‌ హోమ్స్‌ కంపెనీ షేర్లపై బాలీవుడ్‌ ప్రముఖులు ఆసక్తి చూపిస్తున్నారు.

Celebrity Investments : ఓయో షేర్లపై బాలీవుడ్‌ సెలబ్రిటీల ఆసక్తి

న్యూఢిల్లీ: రితేశ్‌ అగర్వాల్‌ స్థాపించిన ఓయో హోట ల్స్‌ అండ్‌ హోమ్స్‌ కంపెనీ షేర్లపై బాలీవుడ్‌ ప్రముఖులు ఆసక్తి చూపిస్తున్నారు. మాధురీ దీక్షిత్‌, అమృతా రావు, నిర్మాత, షారూఖ్‌ ఖాన్‌ సతీమణి గౌరీ ఖాన్‌ గడిచిన కొద్ది నెలల్లో పెద్ద మొత్తంలో ఈ కంపెనీ షేర్లను కొనుగోలు చేశారు. గత ఏడాది ఆగస్టులో ముగిసిన సీరిస్‌ జీ ఫండింగ్‌లో భాగంగా గౌరీ ఖాన్‌ ఏకంగా 24 లక్షల షేర్లు కొనుగోలు చేశారు. ఈ సీరిస్‌ జీ ఫండింగ్‌ ద్వారా ఓయో హోటల్స్‌ గత ఏడాది వివిధ మదుపరుల నుంచి దాదాపు రూ.1,400 కోట్లు సమీకరించింది. మాధురీ దీక్షిత్‌, ఆమె భర్త డాక్టర్‌ శ్రీరామ్‌ నెనె, మరో డాక్టర్‌ రితేష మాలిక్‌తో కలిసి మరో 20 లక్షల షేర్లు కొనుగోలు చేశారు. అమృతా రావు, ఆమె భర్త కూడా సెకండరీ మార్కెట్‌ నుంచి పెద్ద మొత్తంలోనే ఓయో షేర్లు కొన్నట్టు సమాచారం. కాగా ఓయో గత ఏడాది పబ్లిక్‌ ఇష్యూకి వస్తున్నట్లు ప్రకటించింది.

Updated Date - Jan 13 , 2025 | 02:29 AM