Budget 2025: టీడీఎస్.. వృద్ధులకు తగ్గింపు.. అద్దెలపై వచ్చే ఆదాయంపై పెంపు..
ABN , Publish Date - Feb 01 , 2025 | 12:59 PM
శనివారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగాన్ని పూర్తి చేశారు. పలు రంగాలకు కేటాయింపుల గురించి వెల్లడించారు. అలాగే ఆదాయపు పన్ను గురించి కీలక ప్రకటన చేశారు. మరోవైపు ట్యాక్స్ డిడక్షన్ సర్వీస్ (TDS) పై కూడా కీలక ప్రకటనలు చేశారు.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. శనివారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగాన్ని పూర్తి చేశారు. పలు రంగాలకు కేటాయింపుల గురించి వెల్లడించారు. అలాగే ఆదాయపు పన్ను గురించి కీలక ప్రకటన చేశారు. మరోవైపు ట్యాక్స్ డిడక్షన్ సర్వీస్ (TDS) పై కూడా కీలక ప్రకటనలు చేశారు. వచ్చే వారం ఆదాయపు పన్ను ప్రత్యేక బిల్లును తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు.
తాజా బడ్జెట్‌లో వృద్ధులకు నిర్మలమ్మ ఉపశమనం కలిగించారు. సీనియర్ సిటిజన్స్‌కు వడ్డీపై వచ్చే ఆదాయంపై టీడీఎస్ పరిమితిని రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచారు. అయితే ఇళ్లు, గృహ సముదాయాలు లేదా ఇతర నిర్మాణాల ద్వారా వచ్చే ఆదాయంపై టీడీఎస్‌ను రూ.2.4 లక్షల నుంచి ఏకంగా రూ.6 లక్షలకు పెంచారు. అలాగే ఐటీ రిటర్నుల గడువును కూడా పెంచారు. ఏదైనా మదింపు సంవత్సరానికి అప్డేటెడ్ రిటర్నులు సమర్పించడానికి ప్రస్తుతం ఉన్న రెండేళ్ల కాల పరిమితిని నాలుగేళ్లకు పెంచారు.
పార్లమెంట్‌లో వచ్చే వారం ఆదాయపు పన్ను ప్రత్యేక బిల్లును తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. ఆ బిల్లు ఆదాయపు పన్ను విదానాన్ని మరింత సులభతరం చేస్తుందని తెలిపారు. ప్రస్తుత ఆదాయపు పన్ను విధానంలోని నిబంధనలను సగానికి తగ్గించబోతున్నారు.