Share News

Coal India : లిథియం కోసం అర్జెంటీనాలో అన్వేషణ

ABN , Publish Date - Jan 13 , 2025 | 02:38 AM

ప్రభుత్వ రంగం లోని కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (సీఐఎల్‌) ఇతర ఖనిజాల అన్వేషణ, ఉత్పత్తిపైనా దృష్టి పెట్టింది.

Coal India : లిథియం కోసం అర్జెంటీనాలో అన్వేషణ

  • కోల్‌ ఇండియా

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగం లోని కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (సీఐఎల్‌) ఇతర ఖనిజాల అన్వేషణ, ఉత్పత్తిపైనా దృష్టి పెట్టింది. ప్రస్తుతం బొగ్గుకు మాత్రమే పరిమితమైన ఈ మహా నవరత్న కంపెనీ అర్జెంటీనా, ఆస్ట్రేలియా, చిలీ దేశాల్లో లిథియం, నికిల్‌, కోబాల్ట్‌ వంటి అరుదైన లోహాల అన్వేషణకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా అర్జెంటీనాలో లిథియం ఖనిజ అన్వేషణలో తోడ్పడే టెక్నికల్‌ కన్సల్టెంట్ల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ బిడ్స్‌ ఆహ్వానించింది. విద్యుత్‌ వాహనాల్లో ఉపయోగించే లిథియం అయాన్‌ బ్యాటరీల్లో లిథియం ప్రధాన ముడి పదార్ధం. ప్రస్తుతం మన దేశం ఈ ఖనిజాన్ని లేదా బ్యాటరీలను పెద్దఎత్తున దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. విదేశాల్లో లిథియం గనులను చేజిక్కించుకోవడం ద్వారా చైనా లేదా ఇతర దేశాలపై ఆధారపడడం తగ్గించుకోవచ్చని కోల్‌ ఇండియా భావిస్తోంది.

Updated Date - Jan 13 , 2025 | 02:38 AM