Share News

డీమార్ట్‌ లాభం రూ.723 కోట్లు

ABN , Publish Date - Jan 12 , 2025 | 01:30 AM

రిటైల్‌ చెయిన్‌ డీమార్ట్‌ను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ లిమిటెడ్‌.. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.723.54 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే...

డీమార్ట్‌ లాభం రూ.723 కోట్లు

న్యూఢిల్లీ: రిటైల్‌ చెయిన్‌ డీమార్ట్‌ను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ లిమిటెడ్‌.. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.723.54 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికం (రూ.690.41 కోట్లు)తో పోల్చితే లాభం స్వల్పంగా 4.8 శాతం వృద్ధి చెందింది. త్రైమాసిక సమీక్షా కాలంలో కంపెనీ రెవెన్యూ కూడా 17.68 శాతం వృద్ధితో రూ.13,572,47 కోట్ల నుంచి రూ.15,972.55 కోట్లకు పెరిగింది. ఈ కాలంలో మొత్తం వ్యయాలు కూడా 18.52 శాతం పెరిగి రూ.15,001.64 కోట్లుగా నమోదైనట్లు కంపెనీ పేర్కొంది.

Updated Date - Jan 12 , 2025 | 01:30 AM