హైదరాబాద్‌లో గోద్రెజ్ ప్రాపర్టీస్ ప్రాజెక్టు
ABN , Publish Date - Jan 14 , 2025 | 05:20 AM
రియల్ ఎస్టేట్ రంగంలోని గోద్రెజ్ ప్రాపర్టీస్ కంపెనీ హైదరాబాద్‌లో తొలి రెసిడెన్షియల్ ప్రాజెక్టును ప్రారంభించింది. రెగ్యులేటరీ సంస్థలకు పంపిన సమాచారం లో కంపెనీ ఈ విషయం తెలిపింది....
రూ.1300 కోట్ల ఆదాయంపై గురి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): రియల్ ఎస్టేట్ రంగంలోని గోద్రెజ్ ప్రాపర్టీస్ కంపెనీ హైదరాబాద్‌లో తొలి రెసిడెన్షియల్ ప్రాజెక్టును ప్రారంభించింది. రెగ్యులేటరీ సంస్థలకు పంపిన సమాచారం లో కంపెనీ ఈ విషయం తెలిపింది. హైదరాబాద్‌లో వ్యూహాత్మకంగా కీలకమైన కోకాపేట్ ప్రాంతంలో 3 ఎకరాల విస్తీర్ణంలో ‘‘గోద్రెజ్ మాడిసన్ అవెన్యూ’’ పేరిట చేపట్టిన ఈ ప్రాజెక్టులో మొత్తం 12 లక్షల చదరపు అడుగుల స్థలం అమ్మకానికి ఉంటుంది. దీని బుకింగ్ విలువ రూ.1,300 కోట్లుంటుందని అంచనా వేస్తోంది. ఈ ప్రాజెక్టులో 3, 4 బెడ్‌రూమ్ ఫ్లాట్లు అందుబాటులో ఉంటాయి. మంచి వృద్ధి అవకాశాలున్న హైదరాబాద్‌లో ఇది తమ తొలి ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్టు అని కంపెనీ ఎండీ, సీఈఓ గౌరవ్ పాండే తెలిపారు.
మన్‌హటన్ తరహా లాండ్‌స్కే్‌పలతో ఈ ప్రాజెక్టు ఆధునిక జీవనశైలికి అనుగుణంగా ఆకర్షణీయంగా ఉంటుందన్నారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, అగ్రశ్రేణి విద్యా సంస్థలు, ప్రీమియం రిటైల్, హెల్త్‌కేర్ వసతులకు చక్కటి కనెక్టివిటీ కలిగి ఉంటుంది.