Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. భారీగా పతనమైన బంగారం ధరలు..
ABN , Publish Date - Feb 26 , 2025 | 07:01 AM
బంగారం ధరలు బుధవారం నాడు భారీగా పతనమయ్యాయి. సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్లు పసిడి ధరలపై ప్రభావం చూపుతుంటాయి. అయితే నేడు ఒక్కసారిగా ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి.

బిజినెస్ డెస్క్: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధరలు భారీగా తగ్గాయి. కొన్ని నెలలుగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ ధరలు నేడు (26-02-2025) భారీగా తగ్గుముఖం పట్టాయి. https://bullions.co.in/ ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో నిన్న (మంగళవారం) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,953 ఉండగా.. ఇవాళ (బుధవారం) రూ.78,421కి తగ్గింది. అలాగే 24 క్యారెట్ల తులం పసిడి ధర నిన్న రూ.86,130 కాగా.. నేడు రూ.85,550కు పడిపోయింది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర నిన్న రూ.78,907 ఉండగా.. నేడు 78,558కు పడిపోయింది. అలాగే 24 క్యారెట్ల తులం పసిడి ధర మంగళవారం రూ.86,280 కాగా.. బుధవారం రూ.85,700కు తగ్గింది.
హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,218 ఉండగా.. నేడు రూ.78,678కు పడిపోయింది. అలాగే 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర నిన్న రూ.86,420 కాగా.. నేడు రూ.85,830కు తగ్గింది.
ప్రధాన నగరాల్లో బంగారం (22, 24 క్యారెట్ల) ధరలు ఎలా ఉన్నాయంటే..
బెంగళూరు- రూ.78,613, రూ.85,760
కోల్‌కతా- రూ.78,448, రూ.85,580
చెన్నై- రూ.78,778, రూ.85,940
జైపూర్- రూ.78,540, రూ.85,680
దిస్పూర్- రూ.78,723, రూ.85,880
పుణె- రూ.78,558, రూ.85,700
భోపాల్- రూ.78,641, రూ.85,790
ముంబై- రూ.78,558, రూ.85,700
భువనేశ్వర్- రూ.78,577, రూ.78,577
కోయంబత్తూర్- రూ.78,778, రూ.85,940
వెండి ధరలు ఇలా..
ఇక దేశవ్యాప్తంగా వెండి ధరలూ భారీగా తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం కిలో వెండి ధర రూ.95,290 ఉండగా.. బుధవారం రూ.94,040కి తగ్గింది. ముంబైలో నిన్న కేజీ వెండి రూ.95,450 కాగా.. నేడు రూ.94,200కు పడిపోయింది. అలాగే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కిలో వెండి ధర నిన్న రూ.95,600 ఉండగా.. నేడు రూ.94,350కి పడిపోయింది.
ఈ వార్తలు కూడా చదవండి:
2047 నాటికి భారత ఫార్మా పరిశ్రమ రూ.43 లక్షల కోట్లకు..
మరో పదేళ్లలో రూ.2.2 లక్షల కోట్ల స్థాయికి..