Gold and Silver Rates Today: నాలుగో రోజు పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతకు చేరాయంటే..
ABN , Publish Date - Jan 04 , 2025 | 06:46 AM
కొత్త ఏడాదిలో ఓవైపు చలి పెరుగుతోంది. మరోవైపు బంగారం, వెండి ధరలు కూడా పైపైకి చేరుతున్నాయి. చలికాలంలో సైతం వీటిని కొనుగోలు చేయాలని భావించిన వారికి కంటతడి పెట్టిస్తున్నాయి. నేటి వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
కొత్త సంవత్సరం మొదలైనప్పటి నుంచి బంగారం(gold), వెండి (silver) ధరలు నిరంతరంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే వీటి ధరలు వరుసగా నాలుగో రోజు కూడా పెరిగాయి. ఇక నేడు (డిసెంబర్ 4న) శనివారం ఉదయం 6.30 గంటల నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79,360గా ఉంది. మరోవైపు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 72,760కు చేరుకుంది. ఇక వెండి ధరల గురించి మాట్లాడితే ఈ రోజు వెండి ధరల్లో స్వల్ప మార్పు జరిగింది. నేడు కిలో వెండి ధర 92,600 రూపాయలు. కాగా ఇది నిన్న రూ.92,500గా ఉంది. అయితే రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ గోల్డ్ రేట్, 24 క్యారెట్ గోల్డ్ రేట్ (రూపాయల్లో)
చెన్నైలో రూ. 72,610 రూ. 79,210
ముంబైలో రూ. 72,610 రూ. 79,210
ఢిల్లీలో రూ. 72,760 రూ. 79,360
కోల్‌కతాలో రూ. 72,610 రూ. 79,210
బెంగళూరులో రూ. 72,610 రూ. 79,210
హైదరాబాద్‌లో రూ. 72,610 రూ. 79,210
విజయవాడలో రూ. 72,610 రూ. 79,210
కేరళలో రూ. 72,610 రూ. 79,210
పూణేలో రూ. 72,610 రూ. 79,210
వడోదరలో రూ. 72,610 రూ. 79,210
హాల్‌మార్క్ ఉన్నవి కొంటున్నారా లేదా
బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు, ప్రజలు దాని నాణ్యతను గుర్తుంచుకోవాలి. కస్టమర్లు హాల్‌మార్క్ గుర్తును చూసిన తర్వాత మాత్రమే కొనుగోలు చేయాలి. హాల్‌మార్క్ అనేది బంగారంపై ప్రభుత్వ హామీ, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హాల్‌మార్క్‌ని నిర్ణయిస్తుంది.
బంగారం స్వచ్ఛత తెలుసుకోవడం ఎలా?
బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) ద్వారా హాల్ మార్కులు ఇస్తారు. 24 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 999, 23 క్యారెట్లపై 958, 22 క్యారెట్‌పై 916, 21 క్యారెట్‌పై 875, 18 క్యారెట్‌పై 750 అని రాసి ఉంటుంది. ఎక్కువగా బంగారాన్ని 22 క్యారెట్లలో విక్రయిస్తుండగా, కొందరు 18 క్యారెట్లను కూడా ఉపయోగిస్తున్నారు. 24 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారం దాదాపు 91 శాతం స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారంలో 9% రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలను కలపడం ద్వారా ఆభరణాలను తయారు చేస్తారు.
ఇవి కూడా చదవండి:
Tax Relief: పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. 87A పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకునే ఛాన్స్
రిలయన్స్ జియో రూ.40,000 కోట్ల ఐపీఓ!
Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..
Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..
Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..
Read More Business News and Latest Telugu News