స్వర్ణం.. సులభ రుణం!
ABN , Publish Date - Feb 05 , 2025 | 06:12 AM
గత ఏడాది నుంచి బంగారం ధర వేగంగా పెరుగుతూ వస్తోంది. సామాన్యులు కొనగలరా..? అనే స్థాయికి చేరుకుంది. దాంతో కొత్తగా బంగారం కొనుగోలు చేసే వారు కాస్త తగ్గిన్పపటికీ.. ఉన్న నగలను...

బ్యాంకుల బంగారం తనఖా రుణాల్లో 71.3 శాతం వృద్ధి
గత డిసెంబరు నాటికి రూ.1.72 లక్షల కోట్లకు చేరిక
గత ఏడాది నుంచి బంగారం ధర వేగంగా పెరుగుతూ వస్తోంది. సామాన్యులు కొనగలరా..? అనే స్థాయికి చేరుకుంది. దాంతో కొత్తగా బంగారం కొనుగోలు చేసే వారు కాస్త తగ్గిన్పపటికీ.. ఉన్న నగలను తాకట్టు పెట్టే రుణాలు పొందే ట్రెండ్ మాత్రం ఊపందుకుంది. తాజా గణాంకాలే ఇందుకు నిదర్శనం. గత ఏడాది డిసెంబరు నాటికి బ్యాంకుల బంగారం రుణాల పోర్ట్‌ఫోలియో వార్షిక ప్రాతిపదికన 71.3 శాతం వృద్ధితో రూ.1.72 లక్షల కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఏడాదిలో ఇదే సమయానికి పసిడి రుణ పోర్ట్‌ఫోలియో వృద్ధి కేవలం 17 శాతమే. గడిచిన కొన్ని సంవత్సరాల్లో బంగారం విలువ బాగా పెరగడంతో పాటు బ్యాంకులు తనఖా రహిత వ్యక్తిగత రుణాల మంజూరులో ఆచితూచి వ్యవహరిస్తుండటం ఇందుకు ప్రధానం కారణాలుగా తెలుస్తోంది. వ్యక్తిగత రుణం లభించే అవకాశం లేని వారికి బంగారం తనఖా రుణాలు మెరుగైన ప్రత్యామ్నయంగా మారాయని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. వ్యక్తిగత రుణంతో పోలిస్తే, గోల్డ్ లోన్స్‌పై వడ్డీ కూడా తక్కువగా ఉండటం మరో కారణమని వారు పేర్కొన్నారు.
గత ఏడాది మార్చి-డిసెంబరు మధ్యలో బంగారం తనఖా రుణాల్లో 68 శాతం వృద్ధి నమోదైందని.. అదే కాలంలో బంగారం ధరలు 21 శాతం పెరిగాయని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అజిత్ వెలోనీ అన్నారు.
2023 నవంబరులో ఆర్‌బీఐ తనఖా రహిత రుణాలపై రిస్క్ వెయి టేజీని 125 శాతానికి పెంచింది. దాంతో బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్‌బీఎ్‌ఫసీ)లు తాకట్టుపై ఇచ్చే బంగారం రుణాలపై దృష్టి సారించాయి. వ్యక్తిగత రుణాలను తగ్గించాయి. దాంతో గత ఏడాది డిసెంబరుతో ముగిసిన 9 నెలల్లో వ్యక్తిగత రుణాలు కేవలం 5-6 శాతం వృద్ధి చెందాయి. అంతక్రితం సంవత్సరంలో ఇదే కాలానికి పర్సనల్ లోన్స్‌లో 16.5 శాతం వృద్ధి నమోదైంది.
గత డిసెంబరుతో ముగిసిన మూడు త్రైమాసికాల్లో తనఖా రహిత రుణాలకు చెందిన ఇతర విభాగాల్లోనూ కేవలం 9.7 శాతం వృద్ధి నమోదైంది. 2023లో ఇదే కాలానికి ఆ విభాగాల రుణ వృద్ధి 20.8 శాతంగా ఉంది. కాగా, రిటైల్ రుణాల పరిధిలోకి వచ్చే హౌసింగ్, వెహికిల్, క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్స్ విభాగాలన్నింటి రుణ వృద్ధి కూడా 17.6 శాతం నుంచి 14.9 శాతానికి జారుకుంది.
ఇవి కూడా చదవండి:
Ratan Tata: రతన్ టాటా యంగ్ ఫ్రెండ్ శంతను నాయుడికి టాటా మోటార్స్‌లో కీలక పదవి
8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Read More Business News and Latest Telugu News