8th Pay Commission: ఈసారి ఉద్యోగుల శాలరీ ఎంత పెరగనుందంటే..
ABN , Publish Date - Mar 26 , 2025 | 06:14 PM
దేశంలో గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపు గురించి అనేక చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈసారి 8వ వేతన సంఘంలో ఉద్యోగుల వేతనాల్లో 19 శాతం పెరుగుదల ఉంటుందని గోల్డ్‌మన్ సాచ్స్ నివేదిక తెలిపింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

8వ వేతన సంఘం(8th Pay Commission)లో జీతాల పెంపు గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈసారి ఉద్యోగుల జీతాలలో 19 శాతం పెరుగుదల ఉంటుందని గోల్డ్‌మన్ సాచ్స్ రిపోర్ట్ అంచనా వేసింది. ఇది ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఒక మంచి సాయంగా నిలిస్తుందని నివేదిక తెలిపింది. ఈ అంచనాలు నిజం అయితే ఉద్యోగులతో పాటు ఆర్ధిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.
65 లక్షలకు పైగా
8వ వేతన సంఘం తాజా విశ్లేషణల ప్రకారం 2026 లేదా 2027లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో రూ. 14,000 నుంచి రూ. 19,000 వరకు పెరుగుదల ఉన్నట్లు గోల్డ్‌మన్ సాచ్స్ అంచనా వేసింది. ఇది ప్రస్తుతం వారి సగటు నెలవారీ జీతం కంటే 14% నుంచి 19% మధ్య పెరుగుదల ఉంటుందని తెలిపింది. ఈ పెరుగుదలతో 50 లక్షల కంటే ఎక్కువ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 65 లక్షలకు పైగా పెన్షనర్లకు లాభం చేకూరనుంది.
8వ వేతన సంఘం గురించి
ప్రస్తుతం 8వ వేతన సంఘం బృందం ఏర్పడేందుకు 2025 ఏప్రిల్లో ప్రక్రియ మొదలవుతుంది. ఈ సంఘం 2026 లేదా 2027లో అమలుపై నిర్ణయం తీసుకోనుంది. 7వ వేతన సంఘం అమలు చేసినప్పుడు, జీతాలు, పెన్షన్ల పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 1.02 లక్షల కోట్ల వ్యయాన్ని భరించింది. ఇప్పుడు 8వ వేతన సంఘం కోసం, మూడు విధాలుగా జీతాల పెంపు ఉంటుందని చర్చలు జరుగుతున్నాయి.
కేంద్రం 8వ వేతన సంఘం కోసం రూ. 1.75 లక్షల కోట్లు కేటాయిస్తే, సగటు జీతం నెలకు రూ. 14,600 పెరుగుతుంది.
రూ. 2 లక్షల కోట్లు కేటాయిస్తే, సగటు జీతం నెలకు రూ. 16,700 పెరుగుతుంది.
రూ. 2.25 లక్షల కోట్లు కేటాయిస్తే, సగటు జీతం నెలకు రూ. 18,800 పెరుగుతుంది.
ఈ పెరుగుదల మొత్తం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను ప్రభావితం చేస్తుంది. జీతాలతోపాటు పెన్షన్ కూడా పెరుగుతుంది.
ఫిట్‌మెంట్ ఎలా
7వ వేతన సంఘం ప్రకారం 2.57 ఫిట్‌మెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల్లో 157% పెరుగుదలకు దారితీసింది. దీని ప్రకారం ప్రస్తుతం రూ. 18,000 ఉన్న కనీస జీతం, రూ. 46,260కి పెరుగుతుందని, అలాగే, పెన్షన్ కూడా రూ. 9,000 నుంచి రూ. 23,130కి చేరుతుందని నివేదికలు చెబుతున్నాయి. మరింతగా 8వ వేతన సంఘం కోసం 2.86 ఫిట్‌మెంట్ డిమాండ్ ఉన్నప్పటికీ, పలువురు ఆర్థికవేత్తలు ఇది సాధ్యపదని అంటున్నారు. ఫిట్‌మెంట్ కారకాన్ని 1.92గా తీసుకుంటే, కనీస జీతం రూ. 18,000 నుంచి రూ. 34,560కి పెరుగుతుంది, అంటే 92% పెరుగుదల ఉంటుంది. అయితే వీటిపై త్వరలో అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు.
ఇవి కూడా చదవండి:
Hotel Booking: ఒయో రూమ్స్ కోసం ఆధార్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఇలా చేయండి
Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్
Layoffs: ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Read More Business News and Latest Telugu News