Home » National News
ఢిల్లీతోపాటు దాని పరిధిలోని ప్రజలకు కాస్తా ఉపశమనం లభించింది. బుధవారం "తీవ్రమైన ప్లస్" కేటగిరీ కింద నమోదైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఈరోజు స్వల్పంగా మెరుగుపడింది. అయితే ఏ మేరకు తగ్గింది, ఎంత స్థాయిలో ఉందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
10, 12వ తరగతి CBSE పరీక్షల షెడ్యూల్ 2025ను బోర్డు విడుదల చేసింది. ఈ రెండు తరగతుల పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి జరగనున్నాయి. అయితే ఈ పరీక్షలు ఎప్పటి వరకు కొనసాగుతాయి, ఏ సమయంలో ఉంటాయనే వివరాలను ఇక్కడ చుద్దాం.
పీ-మార్క్, దైనిక్ భాస్కర్, లోక్షాహి మరాఠీ ముద్ర ఎగ్జిట్ పోల్స్ అటు మహాయుతికి కానీ, ఇటు ఎంవీఏ కానీ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ రాకపోవచ్చని అంచనా వేశాయి. పీ-మార్క్ మహాయుతికి 137 నుంచి 157 మధ్య, ఎంవీఏకు 126 నుంచి 146 మధ్య సీట్లు రావచ్చని అంచనా వేసింది.
ఈశాన్య ఢిల్లీలోని సుందర్ నగ్రిలో గత వారం హత్యకు గురైన 28 ఏళ్ల యువకుడి కుటుంబాన్ని ముఖ్యమంత్రి పరామర్శించారు. అనంతరం ఆమె ఢిల్లీలోని శాంతిభద్రతల పరిస్థితిపై మీడియాతో మాట్లాడారు. హతుని కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు.
ఈడీ చార్జిషీటును పరిగణనలోకి తీసుకుని విచారణకు ట్రయిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడాన్ని చిదంబరం హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై సింగిల్ జడ్జి తాజా ఆదేశాలు జారీ చేస్తూ, చిదంబర పిటిషన్పై స్పందించాలని ఈడీని ఆదేశించారు. తదుపరి విచారణను 2025 జనవరికి వాయిదా వేశారు.
ఎన్నికల స్వేచ్ఛగా, సజావుగా జరిగేలా చూడాలని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి, ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులను ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆదేశించారు. ఫిర్యాదులు అందిన తక్షణమే చర్యలు తీసుకోవాలని, తీసుకున్న చర్యలను ఫిర్యాదుదారుని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో తెలియజేయాలని కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారు
మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా, జార్ఖాండ్లో రెండో విడతగా 38 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న వెలువడతాయి.
ఒడిశాలోని వివిధ జిల్లాల్లో మావోయిస్ట్ పార్టీ అగ్రనేత సవ్యసాచి పాండ తీవ్ర అలజడి సృష్టించారు. ఈ నేపథ్యంలో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది.
మంచి చదువు, ఉద్యోగాలను వదిలిపెట్టి ఓ యువకుడు తక్కువ వయస్సులోనే ఓ వ్యాపారాన్ని ప్రారంభించాడు. అప్పుడు జాబ్ వదిలేసిన సమయంలో ఆయనను విమర్శలు చేసిన అనేక మంది ఇప్పుడు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. అయితే అసలు ఆయన ఏం చేశారనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఢిల్లీలో వరుసగా ఆరో రోజు కూడా గాలి కాలుష్యం తీవ్రమైన స్థాయిలోనే ఉంది. దీంతోపాటు ఉత్తర భారతదేశంలో చలి ప్రభావం కూడా పెరగడంతో వైద్యులు హెచ్చరికలు జారీ చేశారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.