Share News

జీఎ్‌సటీ వసూళ్లు రూ.1.77 లక్షల కోట్లు

ABN , Publish Date - Jan 02 , 2025 | 05:53 AM

డిసెంబరు నెలలో వస్తు, సేవల పన్ను (జీఎ్‌సటీ) స్థూల వసూళ్లు రూ.1.77 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2023 డిసెంబరు నెలలో వసూలైన రూ.1.65 లక్షల కోట్లతో పోలిస్తే రాబడి 7.3 శాతం పెరిగింది. బుధవారం విడుదలైన...

జీఎ్‌సటీ వసూళ్లు రూ.1.77 లక్షల కోట్లు

డిసెంబరులో 7.3% పెరుగుదల

  • తెలంగాణలో రూ.5,224 కోట్లు..

  • ఏపీలో రూ.3,315 కోట్ల రాబడి

న్యూఢిల్లీ: డిసెంబరు నెలలో వస్తు, సేవల పన్ను (జీఎ్‌సటీ) స్థూల వసూళ్లు రూ.1.77 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2023 డిసెంబరు నెలలో వసూలైన రూ.1.65 లక్షల కోట్లతో పోలిస్తే రాబడి 7.3 శాతం పెరిగింది. బుధవారం విడుదలైన ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. జీఎ్‌సటీ వసూళ్లలో సెంట్రల్‌ జీఎ్‌సటీ వాటా రూ.32,836 కోట్లుండగా.. స్టేట్‌ జీఎ్‌సటీ రూ.40,499 కోట్లు, ఇంటిగ్రేటెడ్‌ జీఎ్‌సటీ రూ.47,783 కోట్లు, సెస్సు రూ.11,471 కోట్లుగా ఉన్నాయి. గత నెలలో దేశీయ లావాదేవీల ద్వారా జీఎ్‌సటీ ఆదాయం 8.4 శాతం పెరిగి రూ.1.32 లక్షల కోట్లకు చేరుకుంది. దిగుమతులపై విధించిన పన్ను ద్వారా సమకూరిన రాబడి దాదాపు 4 శాతం పెరిగి రూ.44,268 కోట్లకు చేరింది. ఇక నవంబరులో జీఎ్‌సటీ వసూళ్లు 8.5 శాతం వార్షిక వృద్ధితో రూ.1.82 లక్షల కోట్లుగా నమోదయ్యా యి. 2024 ఏప్రిల్‌లో అత్యధికంగా రూ.2.10 లక్షల కోట్లకు పైగా ఆదాయం నమోదైంది. కాగా, గతనెలలో రూ.22,490 కోట్ల రిఫండ్స్‌ను జారీ చేశారు.


గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఇందులో 31 శాతం వృద్ధి నమోదైంది. రిఫండ్స్‌ను సర్దుబాటు చేసిన తర్వాత నికర జీఎ్‌సటీ వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 3.3 శాతం వృద్ధితో రూ.1.54 లక్షల కోట్లకు చేరాయి. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, గతనెల తెలంగాణలో జీఎ్‌సటీ వసూళ్లు వార్షిక ప్రాతిపతికన 10 శాతం వృద్ధి చెంది రూ.5,224 కోట్లకు పెరగగా.. ఆంధ్రప్రదేశ్‌లో వసూళ్లు 6 శాతం తగ్గి రూ.3,315 కోట్లకు పరిమితమయ్యాయి.

Updated Date - Jan 02 , 2025 | 05:53 AM