Share News

కొత్త ఏడాదికి శుభారంభం

ABN , Publish Date - Jan 02 , 2025 | 05:51 AM

స్టాక్‌ మార్కెట్‌ కొత్త ఏడాది తొలి రోజే లాభాల బాట పట్టింది. బుధవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు కొద్ది సేపటికే లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్‌ 368.40 పాయింట్ల లాభంతో 78,507.41 వద్ద, నిఫ్టీ 98.10 పాయింట్ల లాభంతో 23,742.90 వద్ద ముగిశాయి. దీంతో...

కొత్త ఏడాదికి శుభారంభం

సెన్సెక్స్‌ 368 పాయింట్లు అప్‌

ముంబై: స్టాక్‌ మార్కెట్‌ కొత్త ఏడాది తొలి రోజే లాభాల బాట పట్టింది. బుధవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు కొద్ది సేపటికే లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్‌ 368.40 పాయింట్ల లాభంతో 78,507.41 వద్ద, నిఫ్టీ 98.10 పాయింట్ల లాభంతో 23,742.90 వద్ద ముగిశాయి. దీంతో రెండు రోజుల వరుస నష్టాలకు బుధవారం బ్రేక్‌ పడింది. ఇంట్రా డేలో సెన్సెక్స్‌ 617.48 పాయింట్ల లాభంతో 78,756.49 గరిష్ఠ స్థాయిని తాకింది. డిసెంబరు నెల కార్ల అమ్మకాలు బాగుండడంతో బుధవారం ఆటోమొబైల్‌ కంపెనీల షేర్లు మంచి లాభాలతో క్లోజయ్యాయి. ఆటో ప్యాక్‌లో మారుతీ సుజుకీ కంపెనీ షేర్లు అత్యధికంగా 3.26 శాతం, ఎం అండ్‌ ఎం కంపెనీ షేర్లు 2.45 శాతం లాభాలతో ముగిశాయి.


ఎల్‌ అండ్‌ టీ, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా మోటార్స్‌, ఇండ్‌సఇండ్‌ బ్యాంకు, ఏసియన్‌ పెయింట్స్‌, పవర్‌గ్రిడ్‌, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లూ లాభాల బాట పట్టాయి. టాటా స్టీల్‌, అదానీ పోర్ట్సు, జొమాటో, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎస్‌బీఐ, హెచ్‌యూఎల్‌, టెక్‌ మహీంద్ర కంపెనీల షేర్లు మాత్రం నష్టాలతో ముగిశాయి. జనవరి నుంచి మార్చి మధ్య ప్రభుత్వ పెట్టుబడులు ఊపందుకుంటాయన్న వార్తలు కూడా బుధవారం మార్కెట్‌ను లాభాల బాట పట్టించాయి. నిఫ్టీకి 24,000 వద్ద గట్టి రెసిస్టెన్స్‌ ఎదురయ్యే అవకాశం ఉందని టెక్నికల్‌ విశ్లేషకుల అంచనా.

ఇండో ఫార్మ్‌ ఎక్వి్‌పమెంట్‌ ఐపీఓ సబ్‌స్ర్కిప్షన్‌ అదుర్స్‌: మంగళవారం ప్రారంభమైన ఇండో ఫార్మ్‌ ఎక్వి్‌పమెంట్‌ ఐపీఓకు మదుపరుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. రెండో రోజు 54.50 రెట్లు సబ్‌స్ర్కైబ్‌ అయింది.

రూ.440 పెరిగిన పసిడి ధర: బులియన్‌ మార్కెట్‌ కూడా కొత్త ఏడాది లాభాల్లో ప్రారంభమైంది. ఢిల్లీలో 10 గ్రాముల 24 కేరట్ల (మేలిమి) బంగారం రూ.440 లాభంతో రూ.79,390 వద్ద, కిలో వెండి రూ.800 లాభంతో రూ.90,500 వద్ద ముగిశాయి. ఎంసీఎక్స్‌లో మాత్రం ఫిబ్రవరిలో డెలివరీ ఇచ్చే 10 గ్రాముల మేలిమి బంగారం ఎదుగూ బొదుగూ లేకుండా రూ.76,893 వద్ద ముగిసింది.

Updated Date - Jan 02 , 2025 | 05:51 AM