హెచ్‌సీఎల్ టెక్ లాభం రూ.4,591 కోట్లు
ABN , Publish Date - Jan 14 , 2025 | 05:23 AM
ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్ డిసెంబరు త్రైమాసికంలో రూ.29,890 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.4,591 కోట్ల నికర లాభం ఆర్జించిం ది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 5.07 శాతం, నికర లాభం 5.5 శాతం పెరిగాయి...
ఒక్కో షేరుపై రూ.18 డివిడెండ్
న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్ డిసెంబరు త్రైమాసికంలో రూ.29,890 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.4,591 కోట్ల నికర లాభం ఆర్జించిం ది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 5.07 శాతం, నికర లాభం 5.5 శాతం పెరిగాయి. సెప్టెంబరు త్రైమాసికంతో పోలిస్తే మాత్రం లాభా లు 8.4 శాతం, ఆదాయం 3.56 శాతం పెరిగినట్టు కంపెనీ సీఈఓ విజయ కుమార్ చెప్పారు. ఈ ఏడాదికి ఆదాయ వృద్ధిరేటు అంచనాలను సైతం కంపెనీ 3.5-5 శాతం నుంచి 4.5-5 శాతానికి పెంచింది. డిజిటల్, ఏఐ ఆధారిత సేవలు క్యూ3లో కంపెనీ ఆదాయ, లాభాలకు దోహదం చేశాయి.
ప్రత్యేక డివిడెండ్: కంపెనీ స్టాక్ ఎక్స్చేంజిల్లో లిస్టయి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వాటాదారులకు ఒక్కో షేరుపై రూ.18 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. ఇందులో రూ.6 ప్రత్యేక డివిడెండ్ అని తెలిపింది. కంపెనీ క్యూ3 ఆర్థిక ఫలితాలు బాగున్నా బీఎ్‌సఈలో ఈ షేరు 0.56 శాతం నష్టంతో రూ.1,985.25 వద్ద ముగిసింది.