Share News

Hindenburg Research: అదానీ సామ్రాజ్యాన్ని కూల్చడానికి ప్రయత్నించి.. మూతబడుతున్న హిండెన్‌బర్గ్..

ABN , Publish Date - Jan 16 , 2025 | 05:51 PM

భారత బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌ తీవ్ర ఆర్థిక అవతవకలకు పాల్పడుతోందని వెల్లడించి భారత్‌ స్టాక్‌మార్కెట్లలో తీవ్ర అలజడి రేపిన అమెరికన్‌ ఇన్వెస్టిమెంట్‌ రీసెర్చ్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ మూతబడుతోంది. ఈ మేరకు దాని వ్యవస్థాపకుడు నెట్‌ ఆండర్సన్‌ బుధవారం ఓ ప్రకటన చేశారు.

Hindenburg Research: అదానీ సామ్రాజ్యాన్ని కూల్చడానికి ప్రయత్నించి.. మూతబడుతున్న హిండెన్‌బర్గ్..
Hindenburg Research shutting down

భారత బిలియనీర్ గౌతమ్ అదానీ (Gautam Adani)కి చెందిన అదానీ గ్రూప్‌ తీవ్ర ఆర్థిక అవతవకలకు పాల్పడుతోందని వెల్లడించి భారత్‌ స్టాక్‌మార్కెట్లలో తీవ్ర అలజడి రేపిన అమెరికన్‌ ఇన్వెస్టిమెంట్‌ రీసెర్చ్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ (Hindenburg Research) మూతబడుతోంది. ఈ మేరకు దాని వ్యవస్థాపకుడు నెట్‌ ఆండర్సన్‌ బుధవారం ఓ ప్రకటన చేశారు. షార్ట్ సెల్లింగ్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టే హిండెన్‌ బర్గ్‌ సంస్థను 2017లో పది మంది ఉద్యోగులతో ప్రారంభించారు. అప్పట్నుంచి ఎన్నో సంస్థల ఆర్థిక అవకతవకల గురించి, సంస్థ వ్యవహారాల గురించి కథనాలు వెలువరించారు (Hindenburg Research shutting down).


హిండెన్‌బర్గ్ సంస్థ అదానీ గ్రూప్‌ సహా పలు కంపెనీల లావాదేవీల్లో అవతవకలను, అక్రమాలను, రహస్య కార్యకలాపాలను వెల్లడించింది. ఆ క్రమంలో సంస్థ వ్యవస్థాపకుడు ఆండర్సన్ భారీగా డబ్బులు కూడా సంపాదించారు. 2022లో అదానీ గ్రూప్ ఆర్థిక వ్యవహారాల గురించి, అప్పుల గురించి హిండెన్ బర్గ్ సంచలన నివేదిక బయటపెట్టింది. ఆ నివేదిక భారత ఆర్థిక, రాజకీయ వ్యవహరాలను కూడా ప్రభావితం చేసింది. గౌతమ్ అదానీ రోజుల వ్యవధిలోనే లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. అదానీ గ్రూప్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారు నష్టాలను చవిచూశారు. ఆ సమయంలో హిండెన్‌బర్గ్ అదానీ గ్రూప్ షేర్లను షార్ట్ సెల్లింగ్ చేసి భారీగా సంపాదించిందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కూడా పలు సంస్థల గురించి హిండెన్‌బర్గ్ పలు నివేదికలు వెల్లడి చేసింది.


తాజాగా హిండెన్‌బర్గ్‌ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు నెట్‌ ఆండర్సన్‌ ఓ లేఖలో పేర్కొన్నారు. ఈ నిర్ణయం వెనుక ఎవరి బెదిరింపులు గానీ, తన ఆరోగ్య, వ్యక్తిగత సమస్యలు కానీ లేవని ఆండర్సన్‌ స్పష్టం చేశారు. గతంలో తనను తాను నిరూపించుకోవాలని భావించానని, ఇప్పుడు కంఫర్ట్‌జోన్‌లో ఉన్నానని అన్నారు. తమ టీమ్‌లోని ప్రతి ఒక్కరూ మంచి స్థానాల్లో ఉండాలనుకుంటున్నారని అన్నారు. వారందరికి అవసరమైన సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తన లేఖలో పేర్కొన్నారు.


ఏదేమైనా అమెరికాలో ప్రభుత్వం మారుతుండడమే హిండెన్‌బర్గ్ మూసివేతకు కారణమని అందరూ నమ్ముతున్నారు. విదేశాల్లో ఆర్థిక అస్థిరతను సృష్టించి అలజడి రేపేందుకు బైడన్ ప్రభుత్వం హిండెన్‌‌బర్గ్‌ను ప్రోత్సహించిందని ఆరోపణలు ఉన్నాయి. తన రాజకీయ లక్ష్యాల కోసం అమెరికన్ డీప్ స్టేట్ జార్జ్ సోరెస్ తరహాలోనే హిండెన్‌బర్గ్‌ను కూడా ఉపయోగించుకుందని చాలా మంది నమ్ముతున్నారు. ఎందుకంటే హిండెన్‌బర్గ్ ప్రస్థానం మొత్తం విదేశీ స్టాక్ మార్కెట్లను పతనం దిశగానే నడిపించింది. హిండెన్‌బర్గ్ నివేదికలు అదానీ సామ్రాజ్యాన్ని ఏమీ చేయలేకపోయాయి. కానీ, పలు దేశాల ఆర్థిక వ్యవస్థలను మాత్రం కూల్చగలిగాయి.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jan 16 , 2025 | 05:54 PM