Home » Adani Group
అదానీ గ్రూప్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలో లంచం, మోసం ఆరోపణలు రావడంతో భారత స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్ షేర్లు భారీగా పడిపోయాయి. దీంతో క్షణాల్లోనే కంపెనీ లక్షల కోట్ల రూపాయలను నష్టపోయింది. ఆ పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
అదానీ సంస్థలను జమ్మలమడుగుకు స్వాగతిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు. కానీ, అదానీ పేరు చెప్పుకుని వచ్చే దొంగ వైసీపీ కంపెనీలను అనుమతించేది లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
నవంబర్ 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోమవారంనాడిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడారు. తన వాదనకు బలం చేకూర్చే రెండు పోస్టర్లను ఆయన ప్రదర్శించారు.
మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చివేయడంలో పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ హస్తం ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు.
ఈ నెల 7వ తేదీలోపు విద్యుత్ బకాయిలు చెల్లించకపోతే కరెంటు సరఫరాను నిలిపివేస్తామని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ఝార్ఖండ్‌లోని అదానీ పవర్ కంపెనీ హెచ్చరించింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు.. ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’కి మరో భారీ విరాళం అందింది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ ఇటీవలే రూ.100 కోట్లు అందించగా శనివారం అంతకు రెట్టింపు విరాళాన్ని ‘మేఘా’ ప్రకటించింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి భారీ విరాళం అందింది. దానికి అదానీ ఫౌండేషన్ రూ.100 కోట్ల విరాళాన్ని అందించింది.
దేశంలో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి చెందిన రెండు కంపెనీలు విలీనమయ్యాయి. స్టాక్ మార్కెట్‌కు ఇచ్చిన సమాచారం ఆధారంగా అదానీ గ్రూప్‌కు చెందిన రెండు కంపెనీలు విలీనం అయినట్లు వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
అదానీ గ్రూప్‌నకు సంబంధించి ఇటీవల స్విట్జర్లాండ్ ఫెడరల్ క్రిమినల్ కోర్టు స్తంభింపచేసిన బ్యాంకు ఖాతాలను స్విస్ అటార్నీ జనరల్ ఆఫీస్ (ఓఏజీ) నిశితంగా పరిశీలిస్తోంది.
వరద బాధితుల కోసం అనేక మంది దాతలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇస్తున్నారు. గురువారం అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేశ్‌ను కలిసి విరాళాల చెక్కులను అందజేశారు. ఆ దాతల్ని సీఎం చంద్రబాబు, లోకేశ్ అభినందించారు.