Share News

ఐటీ కంపెనీ సంచలన నిర్ణయం.. 9 వేల మందిపై వేటు

ABN , Publish Date - Mar 27 , 2025 | 10:02 AM

ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీల్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఎవరి ఉద్యోగం ఎప్పుడు ఉడుతుందో తెలియని టెన్షన్‌లో ఉన్నారు. ఇప్పటికే అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగించగా.. ఈ జాబితాలోకి మరో టెక్ కంపెనీ చేరింది. ఏకంగా 9 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇంతకు అది ఏ కంపెనీ అంటే..

ఐటీ కంపెనీ సంచలన నిర్ణయం.. 9 వేల మందిపై వేటు
Layoffs

ఐటీ కంపెనీల్లో అనిశ్చితి కొనసాగుతుంది. నిర్వహణ ఖర్చు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో చాలా కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. వందలు, వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ఉద్యోగ భద్రత లేకపోవడంతో.. ఐటీ ఎంప్లాయిస్ తీవ్ర భయాందోళనలో ఉన్నారు. బయట ఒక్క ఉద్యోగం కోసం వందల మంది పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో ఐటీ కంపెనీ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. ఏకంగా 9 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు రెడీ అవుతుంది. ఆ వివరాలు..


ప్రముఖ టెక్ దిగ్గజం ఐబీఎం 9 వేల మంది ఉద్యోగుల తొలగింపుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. అమెరికాలోని పలు ప్రాంతాల్లోని ఐబీఎం బ్రాంచ్‌ల్లో పని చేస్తున్న వేర్వేరు శాఖలకు చెందిన ఉద్యోగులను తొలగించేందుకు కంపెనీ రెడీ అయినట్లు తెలుస్తోంది. కార్పొరేట్ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సుమారు 25 శాతం మంది ఉద్యోగుల మీద ఈ ప్రభావం పడనుంది. కన్సల్టింగ్ సర్వీసులు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రామ్స్, సేల్స్, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్ష్ర్ర్ వంటి విభగాల్లో పని చేస్తున్న ఉద్యోగులపై ఈ ప్రభావం అధికంగా పడనుందని తెలుస్తోంది. అంతేకాక కంపెనీ సీఐఓ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్న ఉద్యోగుల భవితవ్యం కూడా ప్రమాదంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే క్లౌడ్ డివిజన్‌లో పని చేస్తున్న ఉద్యోగుల్లో సుమారు 10 శాతం మందిని వెళ్లిపోవాల్సిందిగా కోరినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.


తొలగింపుల్లో.. ఐబీఎం క్లౌడ్ క్లాసికల్ డిజిటల్ విభాగంలో ఉద్యోగులే అధికంగా ఉండనున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఐబీఎం భారీ తొలగింపుల వెనక ఉన్న ప్రధాన కారణం.. అమెరికాలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుని.. భారత్‌లో మరిన్ని ఉద్యోగాలను విస్తరించాలని భావిస్తుంది అని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఉద్యోగాల కోతలు టెక్సాస్, కాలిఫోర్నియా, న్యూయార్క్ నగరం, డల్లాస్, రాలీ, నార్త్ కరోలినాలోని ఉద్యోగులను ప్రభావితం చేయనున్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇదలా ఉంచితే.. భారత్ విషయానికి వస్తే. .ఐబీఎం.. పూణే, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో ఉద్యోగుల సంఖ్యను పెంచుతూ పోతుంది.


అయితే ఉద్యోగుల తొలగింపుపై ఐబీఎం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. అయితే కంపెనీ గతంలో తన శ్రామిక శక్తిని క్రమబద్ధీకరించాలని భావిస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఇప్పటికే పలు టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో ఐబీఎం కూడా చేరనుంది అన్నమాట.

ఇవి కూడా చదవండి:

భారత్‌కు కుబేరులు బై బై!

బ్యాంకు ఖాతాలకు ఇక నలుగురు నామినీలు

Updated Date - Mar 27 , 2025 | 10:13 AM