Share News

Financial Savings: పొదుపు చేయడం లేదా మిమల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు

ABN , Publish Date - Mar 24 , 2025 | 11:24 AM

మీకు పొదుపు చేయడం అలవాటు లేదా.. అయితే ఇక మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు అంటున్నారు ఆర్థిక నిపుణులు. పొదుపు చేయకపోతే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో వివరిస్తున్నారు.

Financial Savings: పొదుపు చేయడం లేదా మిమల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు
Savings

నెల సరి వేతనం పొందే వాళ్లైనా, రోజు కూలీ పని మీద ఆధారపడి బతికే వారైనా సరే.. ప్రతి నెల ఎంతో కొంత మొత్తం పొదుపు చేయడం చాలా మంచి అలవాటు. పొదుపును నిర్లక్ష్యం చేస్తే.. అది మీ కుటుంబాన్నే దెబ్బ తీస్తుంది. నివేదికల ప్రకారం చాలా వరకు భారతీయ కుటుంబాలు పొదుపుకు దూరంగా ఉంటున్నాయి. మరి పొదుపును నిర్లక్ష్యం చేయడం వల్ల తలెత్తే సమస్యలు ఏంటో ఇక్కడ చూద్దాం.

అత్యవసర ఖర్చులకు ఇబ్బంది

ప్రతి నెల ఎంతో కొంత పొదుపు చేయకపోతే.. అత్యవసర ఖర్చులకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా వైద్యం, వాహన మరమ్మత్తు వంటి ఊహించని ఖర్చులు వచ్చినప్పుడు.. పొదుపు నిధులు లేనందువల్ల... అప్పులు చేయాల్సి వస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గణాంకాల ప్రకారం.. సుమారు 60 శాతం భారతీయ కుటుంబాలకు అత్యవసర నిధులు లేవని తెలిసింది.


పెట్టుబడి అవకాశాలు కోల్పోతారు

ప్రతి నెల ఎంతో కొంద పొదుపు చేయకపోతే.. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్‌ వంటి రాబడి మార్గాల్లో పెట్టుబడి పెట్టలేము. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్ఈ) డేటా ప్రకారం.. దీర్ఘకాల పెట్టుబడులు 8-12 శాతం రాబడి ఇస్తాయి. పొదుపు అలవాటు లేని వారు.. వీటిల్లో పెట్టుబడులు పెట్టలేరు.. ఆ ప్రయోజనాలను పొందలేరు.

అప్పుల భారం

పొదుపు అలవాటు లేని వారు.. ఖర్చుల కోసం క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలపై ఆధారపడతారు. దీనివల్ల వారిపై వడ్డీ భారం పెరుగుతుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎమ్) అధ్యయనం ప్రకారం, అప్పుల మీద వడ్డీ రేట్లు 15-24 శాతం వరకు ఉంటున్నట్లు తెలిసింది. ఇది అదనపు భారం కలిగిస్తుంది.


భవిష్యత్తుకు భద్రత ఉండదు

పొదుపు అలవాటు లేకపోతే.. భవిష్యత్తుకు భద్రత ఉండదు. మరీ ముఖ్యంగా పదవీ విరమణ, పిల్లల చదువు వంటి పెద్ద లక్ష్యాలకు నిధులు అందుబాటులో లేక.. అప్పులు చేయాల్సి వస్తుంది. దీని వల్ల ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని ఎకనామిక్ సర్వే 2023 తెలుపుతుంది. భారతీయుల్లో 70 శాతం మంది పదవీ విరమణకు సిద్ధంగా లేరని తెలుస్తోంది.

మానసిక ఒత్తిడి

అవసరాలకు సరిపడా డబ్బులు లేకపోతే.. ఆందోళన, ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ప్రకారం మన సమాజంలో సుమారు 40 శాతం మందిలో డిప్రెషన్‌కు ఆర్థిక సమస్యలే ప్రధాన కారణం అవుతున్నట్లు తెలుస్తుంది.

సలహా

నెలకు 10-20 శాతం ఆదాయాన్ని పొదుపు చేయడం వల్ల అత్యవసర నిధి సిద్ధంగా ఉంటుంది. ఆర్థిక స్థిరత్వం కోసం ఇది ఎంతో ప్రధానం అంటున్నారు నిపుణులు.

Updated Date - Mar 24 , 2025 | 11:27 AM