Share News

Groww: ఎన్‌ఎస్‌ఈలో 84 లక్షలకు పైగా కొత్త డీమ్యాట్ ఖాతాలు

ABN , Publish Date - Apr 18 , 2025 | 03:33 AM

భారతదేశంలో పెట్టుబడి రంగంలో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) 84 లక్షలకు పైగా కొత్త డీమ్యాట్ ఖాతాలను జోడించింది.

Groww: ఎన్‌ఎస్‌ఈలో 84 లక్షలకు పైగా కొత్త డీమ్యాట్ ఖాతాలు

ముంబయి: భారతదేశంలో పెట్టుబడి రంగంలో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) 84 లక్షలకు పైగా కొత్త డీమ్యాట్ ఖాతాలను జోడించింది. ఇది సంవత్సరానికి 20.5% వృద్ధిని సూచిస్తుంది. ప్రస్తుతం మొత్తం యాక్టివ్ డీమ్యాట్ ఖాతాల సంఖ్య 4.92 కోట్లకు చేరింది. ఈ వృద్ధిలో గ్రో అనే బ్రోకరేజ్ సంస్థ ముందంజలో నిలిచింది. ఇది మొత్తం కొత్త ఖాతాలలో 40% కంటే ఎక్కువ భాగాన్ని సొంతం చేసుకుంది. దీంతో గ్రో దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రోకరేజ్ వేదికగా నిలిచింది. ఎన్‌ఎస్‌ఈ గణాంకాల ప్రకారం.. గ్రో చురుకైన క్లయింట్ల సంఖ్య 2024 మార్చిలో 95 లక్షల నుండి 2025 మార్చి నాటికి 1.29 కోట్లకు పెరిగింది. ఇది 36% వృద్ధిని సూచిస్తోంది.


మహిళా పెట్టుబడిదారులు..

గ్రో సగటు నెలవారీ క్లయింట్ వృద్ధి 3%గా ఉంది, ఇది పరిశ్రమ సగటు 1.74% కంటే ఎక్కువ. ఈ డేటా వ్యక్తిగత పెట్టుబడుల పెరుగుదలను సూచిస్తుంది, ఇందులో యువ, సాంకేతిక పరిజ్ఞానం గల తరం సులభమైన వేదికలు, పారదర్శక ప్రక్రియలు, సరళమైన ఆన్‌బోర్డింగ్‌ను ఎంచుకుంటోంది. కొత్త డీమ్యాట్ ఖాతాదారుల సగటు వయస్సు క్రమంగా తగ్గుతోంది, దాదాపు 30 ఏళ్లలోపు వారు ఎక్కువగా ఉన్నారు. అంతేకాక, మహిళా పెట్టుబడిదారుల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రతి నలుగురు కొత్త పెట్టుబడిదారులలో ఒకరు మహిళగా ఉండటం సానుకూల పరిణామం.


మూర్ఛవ్యాధిగ్రస్తులకు శుభవార్త..

అలెంబిక్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (అలెంబిక్) కార్బమాజెపైన్ టాబ్లెట్స్ యూఎస్‌పీ, 200 మి.గ్రా.ల తయారీ కోసం యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్‌ఎఫ్‌డీఏ) నుంచి ఆమోదం పొందినట్లు తెలిపింది. కార్బమాజెపైన్ టాబ్లెట్స్ యూఎస్‌పీని మూర్ఛవ్యాధి చికిత్సలో ఉపయోగిస్తారు. ట్రైజెమినల్ న్యూరాల్జియాతో సంబంధిత వ్యాధి చికిత్సలోనూ వీటిని వాడతారు.

Updated Date - Apr 18 , 2025 | 03:33 AM