Share News

Bilateral Trade Agreement: భారత్‌-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు షురూ

ABN , Publish Date - Apr 24 , 2025 | 03:11 AM

భారత్‌-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు వాషింగ్టన్‌లో ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు సాగనున్న ఈ చర్చల్లో వాణిజ్య అవరోధాలపై పరిష్కార మార్గాలు అన్వేషించనున్నారు.

Bilateral Trade Agreement: భారత్‌-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు షురూ

న్యూఢిల్లీ: ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై భారత్‌- అమెరికా అధికారుల మధ్య చర్చలు వాషింగ్టన్‌లో బుధవారం ప్రారంభయ్యాయి. మూడు రోజులపాటు సాగనున్న ఈ చర్చలు ఇరు దేశాల మధ్య వాణిజ్యంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడంతోపాటు వీలైనంత త్వరగా ఒప్పందం కుదుర్చుకోవడానికి బాటలు వేయనున్నాయి. భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ద్వారా తమ వస్తువులకు కొత్త మార్కెట్లకు ప్రవేశం లభించడంతోపాటు ఇరు దేశాల్లోని కార్మికులు, రైతులు, పారిశ్రామికవేత్తలకు మరిన్ని అవకాశాలు లభించనున్నాయని అమెరికా పేర్కొంది. భారత మార్కెట్లోకి మరింత సులువుగా ప్రవేశం, సుంకాలు, ఇతర అవరోధాలను తగ్గించుకోవడంతోపాటు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం అదనపు హామీలను అమెరికా కోరుకుంటోంది.

Updated Date - Apr 24 , 2025 | 03:11 AM