Viral News: ఈ భారత సీఈవో జీతం రోజుకు రూ. 48 కోట్లు.. సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ కాదు..
ABN , Publish Date - Jan 05 , 2025 | 10:44 AM
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న CEOలలో అత్యంత ప్రఖ్యాతి పొందిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కానీ ఇటీవల భారతీయ సంతతికి చెందిన జగదీప్ సింగ్ ప్రపంచంలోని అత్యంత సంపన్న CEOగా నిలిచారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ప్రపంచంలో అత్యధిక వేతనం పొందుతున్న CEO ఎవరో తెలుసా. అనేక మంది వెంటనే సత్య నాదెళ్ల? సుందర్ పిచాయ్? లేదా బహుశా ఎలోన్ మస్క్ అని అనుకుంటారు. కానీ ఏ మాత్రం కాదు. వీళ్లని వెనక్కి నెట్టి మాజీ క్వాంటమ్‌స్కేప్ సీఈఓ జగదీప్ సింగ్ (Jagdeep Singh) నేడు ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందుతున్న సీఈఓగా మారారు. ఆయన వార్షిక ఆదాయం రూ. 17,500 కోట్లు ($2.1 బిలియన్), ఇది రోజుకు రూ. 48 కోట్లకు సమానం. ఈ అసాధారణ జీతం ఆయనను ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన CEOని చేసింది.
గణాంకాలే కాదు
భారతీయ సంతతికి చెందిన జగదీప్ సింగ్ ప్రస్తుతం ప్రపంచ వ్యాపార ప్రపంచంలో ప్రతిధ్వనించే పేరు. ఎందుకంటే అతని అద్భుతమైన విజయం ఆయనను ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందే వ్యక్తిగా చేసింది. సీఈవోల జాబితాలో అగ్రస్థానానికి చేర్చింది. జగ్దీప్ సింగ్ వార్షిక ప్యాకేజీ రూ. 17,500 కోట్లు. ఈ లెక్క చూస్తే రోజుకు దాదాపు రూ. 48 కోట్లు. కేవలం గణాంకాలే కాదు, ఆయన కృషి, దూరదృష్టి, ఆవిష్కరణలే జగదీప్ సింగ్‌ను ఈ గమ్యానికి తీసుకెళ్లాయని నిపుణులు చెబుతున్నారు.
2010లో మొదలైన ప్రయాణం
2010లో క్వాంటమ్‌స్కేప్ అనే కంపెనీని స్థాపించడంతో జగదీప్ సింగ్ ప్రయాణం మొదలైంది. ఈ సంస్థ ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం శక్తి సామర్థ్యంతో కూడిన సాలిడ్ స్టేట్ బ్యాటరీలపై పనిచేస్తుంది. ఈ బ్యాటరీలు, శక్తి సామర్థ్యం, తక్కువ ఛార్జింగ్ సమయంతో EV పరిశ్రమలో అనోకమైన విప్లవాన్ని తీసుకొచ్చాయి.
చదువు
జగదీప్ సింగ్ విద్య, అనుభవం తన విజయానికి సపోర్ట్ అందించాయి. స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ నుంచి బి.టెక్, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పూర్తిచేసిన ఆయన, వివిధ కంపెనీలలో కీలకమైన పదవులను చేపట్టారు. అప్పుడు తన సొంత సంస్థను స్థాపించడంతో, ఆయన వ్యాపారాన్ని, సాంకేతికతను బాగా మార్పు చేశారు.
పదవికి రాజీనామా చేసి
2024లో జగ్దీప్ సింగ్ క్వాంటమ్ స్కేప్ సీఈఓ పదవికి రాజీనామా చేశారు. కానీ ప్రయాణం ఇక్కడితో ముగియలేదు. ఈరోజు ఆయన కొత్త స్టెల్త్ స్టార్టప్‌కి CEOగా ఉన్నారు. ఆయన మరోసారి అలాంటి టెక్నాలజీపై పని చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. దీంతో ఆయన భవిష్యత్తులో మరిన్ని కొత్త అద్భుతాలు చేయగలరని నిరూపించారు. దీంతో జగదీప్ సింగ్ లాంటి వ్యక్తులు భారతదేశానికే కాదు, యావత్ ప్రపంచానికి స్ఫూర్తి అని వ్యాపార వర్గాలు కొనియాడుతున్నాయి. సరైన దిశానిర్దేశం, కృషి ఉంటే ఏది అసాధ్యం కాదని.. దేనినైనా సాధించవచ్చని జగ్దీప్ సింగ్ చెప్పకనే చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
Bima Sakhi Yojana: బీమా సఖి యోజన స్కీం ఇలా అప్లై చేయండి.. నెలకు రూ.7 వేలు పొందండి..
Investment Tips: సిప్ పెట్టుబడుల మ్యాజిక్.. ఇలా రూ. 7 కోట్లు పొందండి..
Piyush Goyal: ఈవీలకు సబ్సిడీలు అవసరం లేదు.. వారే స్వయంగా చెప్పారు
Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..
Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..
Read More Business News and Latest Telugu News