Stock Market Update: స్వల్ప లాభాల్లో గట్టెక్కిన నిఫ్టీ, సెన్సెక్స్ రెడ్ లో బ్యాంక్ నిఫ్టీ
ABN , Publish Date - Mar 25 , 2025 | 04:10 PM
భారత స్టాక్ మార్కెట్లు మిశ్రమ ఫలితాలతో ముగిశాయి. నిఫ్టీ, సెన్సెక్స్ స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ మాత్రం

Stock Markets: ఇవాళ భారత స్టాక్ మార్కెట్లు మిశ్రమ ఫలితాలతో ముగిశాయి. నిఫ్టీ, సెన్సెక్స్ స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ మాత్రం 97 పాయింట్ల స్వల్ప నష్టాలతో ముగించింది. ఈ ఉదయం మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ అప్ తో ప్రారంభమై వరుసగా ఏడవ రోజు గ్రీన్ లో నిలిచింది. ఆ తర్వాత తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 32 పాయింట్లు పుంజుకొని 78,017 వద్ద నిలిచింది. నిఫ్టీ 10 పాయింట్లు పెరిగి 23,668 దగ్గర నిలిచింది. అటు, డాలరుతో పోలిస్తే రూపాయి విలువ రూ. 85.68 వద్ద ఉంది.
బ్యాంక్ నిఫ్టీ ఇవాళ రెడ్ లో క్లోజైంది. 97 పాయింట్లు కోల్పోయి 51,607 దగ్గర నిలిచింది. ఫిన్ నిఫ్టీ 28 పాయింట్లు పెరిగి 25,086 దగ్గర ముగియగా, బ్యాంకెక్స్ 64 పాయింట్లు కోల్పోయి 59,580 దగ్గర ముగిసింది. అటు, మిడ్ క్యాప్ ఇండెక్స్‌లు కూడా నష్టాల్లో ముగిశాయి. వరుసగా 7వ రోజు లాభాల పరంపరని కొనసాగిస్తూ దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా ప్రారంభంలో భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అయితే, ఉదయం 9.45 గంటల తర్వాత నుంచి క్రమంగా మార్కెట్లు తగ్గుతూ వచ్చాయి.
ఉదయం 9.25 సమయంలో నిఫ్టీ 23,870 వద్దకు చేరింది. సెన్సెక్స్ ప్రారంభంలో 78,750 వరకూ చేరింది. ఇవాళ సెన్సెక్స్ ఎక్స్‌పయిరీ కూడా ఉండటంతో మార్కెట్లు ఒడిదుడుకుల్లో కొనసాగాయి. ఒక దశలో నిఫ్టీ 23, 800 మార్క్ ను చేరుకోవడం ఇవాళ్టి మార్కెట్లో విశేషం. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 1 శాతానికి పైగా నష్టాలు ఎదుర్కొన్నాయి.సెన్సెక్స్ 30 సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్‌సర్వ్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభాలివ్వగా, జొమాటో, ఇండస్ ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 73.46 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 3027 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
ఇవి కూడా చదవండి..
YS Sharmila Petrol Tax Criticism: వాటి ధరలు ఎప్పుడు తగ్గిస్తారు.. కూటమి సర్కార్‌కు షర్మిల ప్రశ్న
Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ
Read Latest AP News And Telugu News