Share News

'గోకా.. నాకా' అన్నట్లుంది.!

ABN , Publish Date - Mar 25 , 2025 | 02:39 PM

ఆ కోతి రాముడు ఎవరో సందర్భం వచ్చినప్పుడు చెప్తా. అది అసలే కోతి... కళ్ళు తాగింది.. ఇష్టా రీతిలో మాట్లాడుతోంది.

'గోకా.. నాకా' అన్నట్లుంది.!
MLA Vemula veeresham

నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం (MLA Vemula Veeresham) ఇవాళ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. అసెంబ్లీ దగ్గర మీడియాతో జరిపిన చిట్ చాట్ లో ఆయన తన ప్రత్యర్థిపై పరోక్షంగా సెటైర్లు వేశారు. " సోషల్ మీడియాలో కొందరు కోతి రాముళ్ళు ఉన్నారు. కోతికి కొబ్బరి చిప్ప దొరికితే గోకా.. నాకా అన్నట్లు ఉంది వాళ్ళ వ్యవహారం. ఆ కోతి రాముడు ఎవరో సందర్భం వచ్చినప్పుడు చెప్తా. అది అసలే కోతి... కళ్ళు తాగింది.. ఇష్టా రీతిలో మాట్లాడుతోంది. దళితులు అంటే వారికి ఈర్ష్య.. స్వతంత్రంగా నిలబడితే తట్టుకోలేకపోతున్నారు. గతంలో వాళ్లకు లీక్‌ల అలవాటు ఉంది." అంటూ ఓ రేంజ్ లో ఆడుకున్నారు ఎమ్మెల్యే వీరేశం.


ఇంకా కోపం ఆగక, మరో దఫా దండకం అందుకున్నారు. "వాళ్లకు లీక్‌లు అంటే ఇష్టం.పల్లీ బఠానీలకు పేపర్లు అమ్ముకుంటారు. చదువు విలువ మాకు తెలుసు. చదవుకునే వారి జీవితాలను పల్లీ బఠానీలకు అమ్ముకున్నారు. దమ్ముంటే డైరెక్ట్ గా ఎదుర్కోవాలి. వాళ్లకు అనుమానాలు ఉంటే సభలో లేవనెత్తోచ్చు. నా పేరు తీస్తే..దళిత సమాజం ఏమనుకుంటుందోనన్న భయం వారికి ఉంది. అందుకే ఆకాశరామన్న ఉత్తరాలు. వాళ్లు బయటకు వస్తే ..నేనూ బయటకు వస్తా. ఎగ్జామ్స్ నిర్వాహణ కు సిస్టం ఉంటుంది. సిస్టంను అడిగితే అసలు విషయాలు తెలుస్తాయి. నన్ను గెలికి గెలికించుకోవద్దు." అంటూ తిట్ల పురాణం పూర్తి చేశారు వీరేశం.


ఇవి కూడా చదవండి...

YS Sharmila Petrol Tax Criticism: వాటి ధరలు ఎప్పుడు తగ్గిస్తారు.. కూటమి సర్కార్‌కు షర్మిల ప్రశ్న

Supreme Court Comments: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 25 , 2025 | 02:47 PM