Share News

ఈ ఏడాది భారత ఆర్థికం బలహీనపడొచ్చు..

ABN , Publish Date - Jan 12 , 2025 | 01:20 AM

ఈ ఏడాది భారత ఆర్థిక వ్యవస్థ కాస్త బలహీనపడవచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టాలినా జార్జివా అన్నారు....

ఈ ఏడాది భారత ఆర్థికం బలహీనపడొచ్చు..

ఐఎంఎఫ్‌

వాషింగ్టన్‌: ఈ ఏడాది భారత ఆర్థిక వ్యవస్థ కాస్త బలహీనపడవచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టాలినా జార్జివా అన్నారు. అమెరికా వాణిజ్య విధానాలపై అంతర్జాతీయంగా అనిశ్చితి పెరిగిందని శుక్రవారం జరిగిన వార్షిక మీడియా రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆమె అన్నారు. ప్రపంచ ఆర్థిక వృద్ధి నిలకడగా కొనసాగనున్నప్పటికీ, ప్రాంతాలవారీగా వృద్ధిలో తేడాలుండవచ్చన్నారు.

Updated Date - Jan 12 , 2025 | 01:20 AM