ఈ వారంలోనూ అప్రమత్తతే మేలు
ABN , Publish Date - Jan 06 , 2025 | 01:45 AM
స్టాక్ మార్కెట్ ఈ వారం మిశ్రమంగా కదలాడే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాలను బట్టి సూచీల గమనం ఉంటుంది. రూపాయి బలహీనత, ఎఫ్‌పీఐల అమ్మకాలు, ఆర్థిక మందగమనం ఈ వారం మార్కెట్‌ను ఎక్కువగా....
స్టాక్ మార్కెట్ ఈ వారం మిశ్రమంగా కదలాడే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాలను బట్టి సూచీల గమనం ఉంటుంది. రూపాయి బలహీనత, ఎఫ్‌పీఐల అమ్మకాలు, ఆర్థిక మందగమనం ఈ వారం మార్కెట్‌ను ఎక్కువగా ప్రభావితం చేయనున్నాయి. గత వారం రియల్టీ, మెటల్ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనైతే, ఆటో, ఫైనాన్స్, కన్జుమర్ డ్యూరబుల్స్, ఎఫ్‌ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ప్రస్తుతం ఫార్మా, హెల్త్‌కేర్ కంపెనీల షేర్లు బుల్లి్‌షగా కనిపిస్తున్నాయి. ఈ అనిశ్చితి నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా ఉండడమే మంచిది.
ఈ వారం స్టాక్ రికమండేషన్లు
ఎన్‌టీపీసీ: జీవిత కాల గరిష్ఠ స్థాయి నుంచి ఎన్‌టీపీసీ షేర్లు ప్రస్తుతం 30 శాతం దిద్దుబాటుకు లోనయ్యా యి. కీలక మద్దతు స్థాయి రూ.300 వద్ద టర్న్ అరౌండ్ అయిన, ఈ కంపెనీ షేర్లు గత నాలుగు సెషన్లుగా అప్‌ట్రెండ్‌లో ట్రేడవుతున్నాయి. గత వారం రూ.339 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.365/385 టార్గెట్‌తో రూ.345 వద్ద పొజిషన్లు తీసుకోవచ్చు. స్టాప్‌లాస్ : రూ.338.
హెచ్‌సీఎల్ టెక్: ఈ కంపెనీ షేర్లు గత వారం రూ.1,946.65 వద్ద క్లోజయ్యాయి. డాలర్‌తో రూపాయి పతనంతో ప్రస్తుతం ఐటీ రంగం బుల్లి్‌షగా కనిపిస్తోంది. దీంతో ఈ కౌంటర్‌లో ట్రేడింగ్, డెలివరీ వాల్యూమ్స్ క్రమంగా పెరుగుతున్నాయి. రూ.1,950 టార్గెట్‌తో మదుపరులు ఈ కౌంటర్లో రూ.1,860పై స్థాయిలో పొజిషన్లు తీసుకోవచ్చు. స్టాప్‌లాస్ : రూ.1,840.
మ్యాక్స్ హెల్త్: ప్రస్తుతం ఈ కంపెనీ షేర్లు జీవిత కాల గరిష్ఠ స్థాయిలో ట్రేడవుతున్నాయి. స్వల్ప పుల్‌బ్యాక్ తర్వాత మరింత బలం పుంజుకున్నాయి. దీనికి తోడు ప్రస్తుతం హెల్త్‌కేర్ సెక్టర్ బుల్లి్‌షగా ఉంది. గత వారం 1.64 శాతం లాభంతో రూ.1,178 వద్ద ముగిశాయి. రూ.1,250/1,310 టార్గెట్‌తో మదుపరులు రూ.1,180 స్థాయిలో ఈ కౌంటర్‌లో పొజిషన్లు తీసుకోవచ్చు. స్టాప్‌లాస్ : రూ.1,165.
కోటక్ మహీంద్ర బ్యాంకు: గత కొన్ని నెలలుగా సైడ్‌వే్‌సలో ఉన్న ఈ బ్యాంకు షేర్లు ప్రస్తుతం ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తున్నాయి. ఈ సంవత్సరం బ్యాంకు ఆర్థిక ఫలితాలు బాగుంటాయని రేటింగ్ సంస్థల అంచనా. రూ.1,970 టార్గెట్‌తో మదుపరులు ఈ కౌంటర్లో రూ.1,850 వద్ద పొజిషన్లు తీసుకోవచ్చు. స్టాప్‌లాస్ : రూ.1,830.
డాబర్: అక్టోబరు గ్యాప్‌డౌన్లతో ఈ కంపెనీ షేర్లు 26 శాతం మేర పతనమయ్యాయి. ప్రస్తుతం కీలక మద్దతు స్థాయి రూ.500 వద్ద మద్దతు తీసుకుని పుంజుకుంటున్నాయి. గత వారం చివరి నాలుగు సెషన్లలోనూ బలం ప్రదర్శించాయి. 2.25 శాతం లాభంతో రూ.524 వద్ద ముగిశాయి. మదుపరులు రూ.590 టార్గెట్‌తో రూ.528 వద్ద పొజిషన్లు తీసుకోవచ్చు. స్టాప్‌లాస్ : రూ.510.
మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.