Share News

MEIL Nuclear Reactor Contract: అణు ఇంధన రంగంలోకి మేఘా

ABN , Publish Date - Apr 24 , 2025 | 03:39 AM

మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) అణు ఇంధన రంగంలోకి అడుగుపెట్టి, రూ.12,800 కోట్ల విలువైన ఎన్‌పీసీఐఎల్‌ ఆర్డర్‌ను దక్కించుకుంది. కర్ణాటక కైగా ప్రాజెక్టుకు రెండు 700 మెగావాట్ల రియాక్టర్లు సరఫరా చేయనుంది

MEIL Nuclear Reactor Contract: అణు ఇంధన రంగంలోకి మేఘా

  • ఎన్‌పీసీఐఎల్‌ నుంచి రూ.12,800 కోట్ల ఆర్డర్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): స్థానిక మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) మరో ఘనత సాధించింది. కంపెనీ అణు ఇంధన రియాక్టర్ల రంగంలోకి ప్రవేశిస్తోంది. న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐఎల్‌) కర్ణాటకలోని కైగా వద్ద నిర్మించే అణు విద్యుత్‌ ప్రాజెక్టు ఐదు, ఆరు యూనిట్లకు ఒక్కోటి 700 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యం ఉండే రెండు అణు రియాక్టర్లు సరఫరా చేయనుంది.

రూ.12,800 కోట్ల ఆర్డర్‌: ఈ ఆర్డర్‌ విలువ రూ.12,800 కోట్లని ఎంఈఐఎల్‌ తెలిపిది. ఎన్‌పీసీఐఎల్‌ చరిత్రలో ఇంత భారీ ఆర్డర్‌ జారీ చేయడం ఇదే మొదటిసారి. ఈ బారీ ఆర్డర్‌ కోసం బీహెచ్‌ఈఎల్‌, ఎల్‌ అండ్‌ టీ కంపెనీలు కూడా పోటీపడ్డాయి. అయితే నాణ్యత, ధరల ఆదారిత ఎంపిక (క్వాలిటీ కమ్‌ కాస్ట్‌ బేస్డ్‌ సెలక్షన్‌) పద్దతిలో ఎన్‌పీసీఐఎల్‌ మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీని ఎంపిక చేసింది. ఈ ఆర్డర్‌ పత్రాలను ఎన్‌పీసీఐఎల్‌ అధికారులు ముంబైలోని తమ ప్రదాన కార్యాలయంలో డైరెక్టర్‌ (ప్రాజెక్ట్స్‌) సీహెచ్‌ సుబ్బయ్యకు అందజేశారు. ఈపీసీ పద్దతిలో నిర్ణీత సమయానికి ఈ ఆర్డర్‌ పూర్తి చేస్తామని ఎంఈఐఎల్‌ తెలిపింది.

Updated Date - Apr 24 , 2025 | 03:40 AM