Share News

నయా ఫండ్స్‌

ABN , Publish Date - Jan 12 , 2025 | 01:26 AM

యూటీఐ క్వాంట్‌ ఫండ్‌, మిరే అసెట్‌ స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌, బంధన్‌ నిఫ్టీ ఇండెక్స్‌ ఫండ్‌...

నయా ఫండ్స్‌

  • యూటీఐ క్వాంట్‌ ఫండ్‌

యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌.. యూటీఐ క్వాంట్‌ ఫండ్‌ను ప్రారంభించింది. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ ఈక్విటీ పథకం. మార్కెట్‌ పరిస్థితులు, ఆటుపోట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నిలకడైన వ్యూహంతో పెట్టుబడులు పెట్టడం ఈ ఫండ్‌ ప్రత్యేకత. క్వాంటిటేటివ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ థీమ్‌తో దీర్ఘకాలంలో మంచి రిటర్నులు అందించే విధంగా ఈ ఫండ్‌ను రూపొందించింది. ఈ ఫండ్‌కు బీఎ్‌సఈ 200 టీఆర్‌ఐ బెంచ్‌మార్క్‌ ఉంటుంది. ఈ ఫండ్‌ కనీస పెట్టుబడి రూ.1,000. ఈ ఫండ్‌ ముగింపు తేదీ ఈ నెల 25.

  • మిరే అసెట్‌ స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌

మిరే అసెట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ మేనేజర్స్‌.. మిరే అసెట్‌ స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ల్లో పెట్టుబడులు పెట్టే ఓపెన్‌ ఎండెడ్‌ ఈక్విటీ పథకం ఇది. నిఫ్టీ స్మాల్‌ క్యాప్‌ 250 టోటల్‌ రిటర్న్‌ ఇండెక్స్‌ (టీఆర్‌ఐ).. ఈ ఫండ్‌ బెంచ్‌మార్క్‌గా ఉండనుంది. ఈ ఫండ్‌ కనీస పెట్టుబడి రూ.5,000. ముగింపు తేదీ జనవరి 24.


  • బంధన్‌ నిఫ్టీ ఇండెక్స్‌ ఫండ్‌

బంధన్‌ మ్యూచువల్‌ ఫండ్‌.. నిఫ్టీ ఆల్ఫా లో వొలాటిలిటీ 30 ఇండెక్స్‌ ఫండ్‌ను తీసుకువచ్చింది. అనిశ్చితితో కూడిన మార్కెట్లలో కూడా నిలకడైన రాబడులు అందించే విధంగా ఈ ఫండ్‌ను రూపొందించింది. దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా బహు ళ వ్యూహంతో పెట్టుబడులు పెట్టడం ఈ ఫండ్‌ ప్రత్యేకత. ఈ ఫండ్‌ ముగింపు తేదీ ఈ నెల 20. కనీస పెట్టుబడి రూ.1,000.

Updated Date - Jan 12 , 2025 | 01:26 AM