Ramraj Cotton: రామ్‌రాజ్‌ కాటన్‌ నుంచి మృదు టవల్స్‌

ABN , First Publish Date - 2025-04-22T02:47:17+05:30 IST

రామ్‌రాజ్‌ కాటన్‌ "మృదు టవల్స్‌" తో హోమ్‌ టెక్స్‌టైల్‌ విభాగంలోకి ప్రవేశించింది. ఈ టవల్స్‌ కోసం నటి మీనాక్షి చౌదరి ప్రచారకర్తగా ఎంపికైంది.

Ramraj Cotton: రామ్‌రాజ్‌ కాటన్‌ నుంచి మృదు టవల్స్‌

  • ప్రచారకర్తగా మీనాక్షి చౌదరి

చెన్నై (ఆంధ్రజ్యోతి): సాంప్రదాయ, ఎథ్నిక్‌ వేర్‌ కంపెనీ రామ్‌రాజ్‌ కాటన్‌.. ప్రీమియం హోమ్‌ టెక్స్‌టైల్‌ విభాగంలోకి ప్రవేశించింది. ‘మృదు టవల్స్‌’ తో రామ్‌రాజ్‌ ఈ విభాగంలోకి అడుగుపెట్టింది. ఈ టవల్స్‌ కోసం ప్రముఖ సినీ నటి మీనాక్షి చౌదరిని బ్రాండ్‌ అంబాసిడర్‌గా రామ్‌రాజ్‌ కాటన్‌ నియమించుకుంది. ఈ సందర్భంగా రామ్‌రాజ్‌ కాటన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అరుణ్‌ ఈశ్వర్‌ మాట్లాడుతూ.. మృదు టవల్స్‌ను వంద శాతం కాటన్‌, వెదురు నారతో తయారు చేసినట్లు చెప్పారు. కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా ఈ టవల్స్‌ను అత్యుత్తమ నాణ్యత, వినూత్నమైన డిజైన్లతో తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. కాగా రామ్‌రాజ్‌ మృదు టవల్స్‌కు ప్రచారకర్తగా ఎంపిక కావటం తనకెంతో ఆనందంగా ఉందని మీనాక్షి చౌదరి అన్నారు.

Updated Date - 2025-04-22T02:48:16+05:30 IST