Account Nomination Rules : నామినేషన్ల వ్యవస్థ పునర్‌వ్యవస్థీకరణ
ABN , Publish Date - Jan 11 , 2025 | 03:54 AM
మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) ఫోలియోలు, డీమ్యాట్ ఖాతాల నామినేషన్ విధానాన్ని సెబీ పునర్ వ్యవస్థీకరించింది.
మార్చి 1 నుంచే అమలు: సెబీ
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) ఫోలియోలు, డీమ్యాట్ ఖాతాల నామినేషన్ విధానాన్ని సెబీ పునర్ వ్యవస్థీకరించింది. దీనికి సంబంధించి శుక్రవారం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ సంవత్సరం మార్చి 1 నుంచే ఇవి అమల్లోకి వస్తాయని తెలిపింది. సెక్యూరిటీస్ మార్కెట్లో పారదర్శకత పెంచడంతో పాటు క్లెయిమ్ చేయని ఆస్తుల తగ్గింపు కోసం సెబీ ఈ చర్య తీసుకుంది. ముఖ్యమైన మార్గదర్శకాలివే..
సింగిల్ హోల్డింగ్ ఖాతాలకు నామినీ తప్పనిసరి
జాయింట్ ఖాతాల్లోని చనిపోయిన వ్యక్తి ఆస్తులు నామినేషన్ లేకపోయినా బతికి ఉన్న మిగతా జాయింట్ ఖాతాదారులకు బదిలీ అవుతాయి
తన తదనంతరం ఎంఎఫ్ ఫోలియోలు, డీమ్యాట్ ఖాతాల్లోని తన ఆస్తులు ఎవరికి ఎవరికి ఎంతెంత చెందాలనే విషయం స్పష్టం చేస్తూ ఖాతాదారులు 10 మందిని నామినేట్ చేసే అవకాశం
ఖాతాదారుడితో పాటు నామినీల్లో ఎవరైనా చనిపోతే ఆస్తులను దామాషా పద్దతిలో మిగతా నామినీలకు పంచుతారు
చనిపోయిన వ్యక్తుల వారసుల తరఫున నామినీలు ట్రస్టీలుగా ఆస్తులు పొందేందుకు ఆమోదం.