Share News

Godrej: సరికొత్త లాకర్ సిస్టమ్స్‌ని ఆవిష్కరించిన గోద్రెజ్..

ABN , Publish Date - Apr 23 , 2025 | 08:56 PM

సెక్యూరిటీ సొల్యూషన్స్ మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉన్న గోద్రెజ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేలా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ మార్కెట్‌లోకి సరికొత్త ప్రీమియం, టెక్ ఆధారిత..

Godrej: సరికొత్త లాకర్ సిస్టమ్స్‌ని ఆవిష్కరించిన గోద్రెజ్..
Godrej

హైదరాబాద్, ఏప్రిల్ 23: సెక్యూరిటీ సొల్యూషన్స్ మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉన్న గోద్రెజ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేలా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ మార్కెట్‌లోకి సరికొత్త ప్రీమియం, టెక్ ఆధారిత హోమ్ లాకర్లను ప్రవేశపెట్టింది. ఇటు కన్స్యూమర్ అటు ఇనిస్టిట్యూషనల్ సెగ్మెంట్లలో అగ్రగామిగా కొనసాగుతున్న కంపెనీ.. హైదరాబాద్‌తో పాటు తెలంగాణవ్యాప్తంగా తన కార్యకలాపాలను మరింతగా విస్తరించే లక్ష్యంతో సరికొత్త లాక్లను ఆవిష్కరించింది.


‘నేడు సెక్యూరిటీ అంటే రక్షణకు మాత్రమే పరిమితం కాకుండా, మారుతున్న జీవన విధానాలకు అనుగుణంగా ఉండే ఇంటెలిజెంట్ సొల్యూషన్స్‌ అందించడం ద్వారా వినియోగదారులకు మరింత సాధికారత కల్పించే విషయంగా మారింది. పట్టణీకరణ వేగవంతం అవుతుండటం, సెక్యూరిటీతో పాటు కళాభిరుచికి కూడా ప్రాధాన్యం పెరుగుతుండటం వంటి అంశాల నేపథ్యంలో హైదరాబాద్‌ లాంటి మార్కెట్లలో హోమ్, ఇనిస్టిట్యూషనల్ సెక్యూరిటీ విభాగంలో సరికొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సాంప్రదాయ సేఫ్‌కీపింగ్‌కి మించి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉండే సరికొత్త ఆవిష్కరణలతో, వినూత్న సొల్యూషన్స్‌ను అందించడం ద్వారా ఈ అవకాశాలను గోద్రెజ్ అందిపుచ్చుకుంటోంది. పట్టణ, సెమీ-అర్బన్ వినియోగదారుల అవసరాలను తీర్చే విధంగా మా లేటెస్ట్ స్మార్ట్ హోమ్ లాకర్లను డిజైన్ చేశాం. ఇందులో బయోమెట్రిక్ యాక్సెస్ నుంచి అలారం సిస్టంల వరకు పలు ప్రత్యేకతలు ఉన్నాయి. తెలంగాణ మాకు చాలా ముఖ్యమైన మార్కెట్‌గా ఉంటోంది. పటిష్టమైన రిటైల్, డిజిటల్ వ్యూహాలతో ఇక్కడ మరింతగా విస్తరించడమనేది, స్థానికంగా అన్ని వర్గాలవారికి అనువైన ఇంటెలిజెంట్ సెక్యూరిటీ సొల్యూషన్స్‌ను మరింతగా అందుబాటులోకి తేవడంపై మా నిబద్ధతను తెలియజేస్తుంది’ అని గోద్రెజ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ బిజినెస్ హెడ్ పుష్కర్ గోఖలే తెలిపారు.


పెరుగుతున్న పట్టణీకరణ, ఆదాయాలు, హోమ్ సెక్యూరిటీపై అవగాహన, వేగవంతమైన వృద్ధి వంటి అంశాలతో హైదరాబాద్ సెక్యూరిటీ సొల్యూషన్స్ మార్కెట్‌లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కీలక ఆర్థిక హబ్‌గా హైదరాబాద్ ఎదుగుతున్న నేపథ్యంలో గృహాల యజమానులు, వ్యాపార సంస్థలు అధునాతనమైన స్మార్ట్ సెక్యూరిటీ సొల్యూషన్స్‌పై మరింతగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలో హోమ్‌ లాకర్లకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. బయోమెట్రిక్ యాక్సెస్, హిడెన్ స్టోరేజ్, ఇంటెలిజెంట్ అలారం సిస్టంలు మొదలైన ఫీచర్లకు వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. వచ్చే 3 ఏళ్లలో తెలంగాణలో హోమ్ లాకర్ సెగ్మెంట్ 18 శాతం వృద్ధి చెందుతుందనే అంచనాలు ఉన్నాయి. దీనికి హైదరాబాద్ సారథ్యం వహించనుంది.


దీనికి అనుగుణంగా తమ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను పెంచుకుంటూ, రిటైల్ భాగస్వామ్యాలను ఏర్పర్చుకుంటూ, డిజిటల్ కార్యకలాపాలను పటిష్టపర్చుకుంటూ హైదరాబాద్, తెలంగాణ వ్యాప్తంగా గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్ మరింతగా విస్తరిస్తోంది. వచ్చే 3 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కంపెనీ 20 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో హైదరాబాద్ వాటా 52 శాతంగా ఉండనుంది. హోమ్ లాకర్ సెగ్మెంట్‌కి సంబంధించి జాతీయ స్థాయిలో కంపెనీకి సుమారు 75 శాతం మార్కెట్ వాటా ఉంది. దేశవ్యాప్తంగా, అలాగే ఏపీ, తెలంగాణ మార్కెట్లోను తన మార్కెట్ వాటాను 80 శాతానికి పెంచుకోవాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.


ఇందులో భాగంగానే సరికొత్త లాకర్లను ఆవిష్కరించింది. అత్యధిక పరిమాణంలో విలువైన ఉత్పత్తులను సురక్షితంగా భద్రపర్చుకునేందుకు ఆభరణాల వ్యాపార సంస్థల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన BIS సర్టిఫైడ్ హై-సెక్యూరిటీ సేఫ్ అయిన డిఫెండర్ ఆరం ప్రో రాయల్ క్లాస్ ఈ సేఫ్(Defender Aurum Pro Royal Class E safe)ను గోద్రెజ్ ఆవిష్కరించింది. అలాగే, పసిడి టెస్టింగ్‌కి సంబంధించి రిటైల్ జ్యుయలరీ, హాల్‌మార్కింగ్ సెంటర్లు, బ్యాంకుల కోసం యాక్యూగోల్డ్ iEDX సిరీస్ (AccuGold iEDX), ఆర్‌సీసీ రీఇన్‌ఫోర్స్‌డ్ స్ట్రాంగ్ రూమ్‌లను నిర్మించడం సవాళ్లతో కూడుకున్న ప్రదేశాల కోసం గోద్రెజ్ ఎంఎక్స్ (Godrej MX) పోర్టబుల్‌ స్ట్రాంగ్ రూమ్ మాడ్యులర్ ప్యానెల్స్‌లాంటి ప్రోడక్ట్స్‌ని కూడా ప్రవేశపెట్టింది.


ఇక గృహ అవసరాల కోసం ఎన్ఎక్స్ ప్రో స్లైడ్, ఎన్ఎక్స్ ప్రో లగ్జీ, రైనో రీగల్, ఎన్ఎక్స్ సీల్ పేరిట కొత్త ఉత్పత్తులను కూడా గోద్రెజ్ ఆవిష్కరించింది. ఆధునిక గృహాలకు అనుగుణమైన డిజైనింగ్‌తో వీటిలో డ్యుయల్ మోడ్ యాక్సెస్ (డిజిటల్, బయోమెట్రిక్), ఇంటెలిజెంట్ ఐబజ్ (Ibuzz) అలారం సిస్టంలు, నిగూఢమైన స్టోరేజ్ కంపార్ట్‌మెంట్స్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఆభరణాల తయారీకి పేరొందిన ప్రాంతాలు, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కూడా గోద్రెజ్ వేగంగా విస్తరిస్తోంది. తమ సెక్యూరిటీ సొల్యూషన్స్‌ను మరింతగా అందుబాటులోకి తెచ్చే దిశగా రిటైల్, డిజిటల్ నెట్‌వర్క్‌ను పటిష్టం చేసుకుంటోంది.


Also Read:

మీ అబ్జర్వేషన్‌కు టెస్ట్.. ఈ రెండు ఫొటోల్లో 3 తేడాలేంటి

ఈ కిరాతకుడే ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి

LPG గ్యాస్ భద్రతా చిట్కాలు ఇవే..

For More Business News and Telugu News..

Updated Date - Apr 23 , 2025 | 08:56 PM