Share News

Share Market Update: స్తబ్ధుగా సాగుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

ABN , Publish Date - Mar 26 , 2025 | 10:42 AM

మార్కెట్ ప్రారంభం కాగానే స్వల్ప లాభాల్లో ట్రేడింగ్‌ మొదలుపెట్టినప్పటికీ ఆ తర్వాత ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి.

Share Market Update: స్తబ్ధుగా సాగుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు
stock market

Stock Market Update: భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఇవాళ సాఫీగా సాగుతున్నాయి. మార్కెట్ ప్రారంభం కాగానే స్వల్ప లాభాల్లో ట్రేడింగ్‌ మొదలుపెట్టినప్పటికీ ఆ తర్వాత ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. ఉదయం 10:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 90 పాయింట్లు నష్టంతో 77,926 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ (Nifty) 2 పాయింట్ల లాభంతో 23,672 వద్ద ఉన్నాయి.


నిన్న అమెరికా మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. డౌజోన్స్‌ ప్లాట్‌గా ముగియగా, ఎస్‌అండ్‌పీ సూచీ 0.16శాతం, నాస్‌డాక్‌ 0.46 శాతం లాభపడ్డాయి. ఇటు, ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నిక్కీ 0.86 శాతం, హాంకాంగ్‌ హాంగెసెంగ్‌ 0.25 శాతం లాభంతో కదలాడుతున్నాయి.


ఇక, విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) నిన్న రూ.5,372 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేయగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.2,769 కోట్ల షేర్లు విక్రయించారు. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్ బ్యారెల్‌ 72.53 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 85.74 వద్ద కొనసాగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

బ్యాంకుల్లోని అన్‌-క్లెయిమ్డ్‌ డిపాజిట్లు రూ.78,000 కోట్ల పైమాటే..

ఢిల్లీ హైకోర్టులో ‘నాట్కో’కు ఊరట

Updated Date - Mar 26 , 2025 | 10:44 AM