Share News

SEBI: కొత్త ఛైర్మన్ సూపరు.. సెబీ సభ్యుల ఆస్తుల వెల్లడికి ప్రతిపాదన

ABN , Publish Date - Mar 25 , 2025 | 06:07 PM

భారత స్టాక్ మార్కెట్లను ముందుకు తీసుకువెళ్లేందుకు చకచకా చర్యలు తీసుకోవడమే కాకుండా సెబీలో పారదర్శకు పెద్దపీట వేస్తున్నారు కొత్త ఛైర్మన్ తుహిన్‌ కాంత పాండే

SEBI: కొత్త ఛైర్మన్ సూపరు.. సెబీ సభ్యుల ఆస్తుల వెల్లడికి ప్రతిపాదన
Tuhin Kanta Pandey

సెబీ(SEBI) కొత్త ఛైర్మన్ గా బాధ్యతలు తీసుకుని నెల రోజులు కూడా గడువకముందే తానేంటో చూపిస్తున్నారు తుహిన్‌ కాంత పాండే(Tuhin Kanta Pandey). భారత స్టాక్ మార్కెట్లను ముందుకు తీసుకువెళ్లేందుకు చకచకా చర్యలు తీసుకోవడమే కాకుండా సెబీ (Securities and Exchange Board of India)లో పారదర్శకు పెద్దపీట వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెబీ చైర్మన్ పాండే సూపరంటూ మార్కెట్ వర్గాల్లో ప్రశంసలు వెల్లివిరుస్తున్నాయి. తాజాగా సెబీ సభ్యుల ఆస్తుల వెల్లడికి ప్రతిపాదించారు పాండే. సెబీ బోర్డు సభ్యులు, అధికారుల ఆస్తులు, అప్పుల వివరాలు తెలియజేసేలా సమగ్ర నిబంధనలపై సమీక్ష నిర్వహించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయబోతున్నారు.


అదానీ గ్రూప్‌ వ్యవహారంలో సెబీ మాజీ ఛైర్‌పర్సన్‌ మాధవిపురి బచ్‌పై గతంలో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారుల లావాదేవీల్లో పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పాండే తెలిపారు. దీనివల్ల ఇక మీదట అధికారులు, ఇతర సెబీ సిబ్బంది తమ ఆస్తులు, అప్పులు, పెట్టుబడులకు సంబంధించి వివరాల వెల్లడి చేయాల్సి ఉంటుంది. సిబ్బంది పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధనలపై కమిటీ క్లారిటీ ఇవ్వబోతోంది.సెబీపై మరింతగా విశ్వాసం పెంపొందించాలంటే ఈ నిబంధనలను సమీక్షించాలని పాండే క‌ృతనిశ్చయంతో ఉన్నారు. అంతేకాదు బోర్డు సభ్యులు, అధికారుల నైతిక ప్రవర్తన, జవాబుదారీతనం, పారదర్శకతను నెలకొల్పాలన్నదే ఈ కమిటీ ఉద్దేశమని పాండే స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి:

Egg: కోడిగుడ్డు.. వెజ్జా.. నాన్ వెజ్జా.. నిపుణులేం చెబుతున్నారు

Viral Video: ఎక్కడ, ఎలా ఆపాలో కూడా తెలియాలి.. అంకుల్ సైక్లింగ్ చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Viral Video: గేటు మధ్యలో ఇరుక్కుపోయిన కారు.. దగ్గరికి వెళ్లి చూడగా షాకింగ్ సీన్..

Updated Date - Mar 25 , 2025 | 06:07 PM