ఉపాధి కల్పనకు సప్తసూత్ర అజెండా
ABN , Publish Date - Jan 06 , 2025 | 01:48 AM
దేశంలో ఉద్యోగాల కల్పనకు కేంద్ర బడ్జెట్‌లో మరిన్ని చర్యలు తీసుకోవాలని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ప్రభుత్వాన్ని కోరింది. సమ్మిళిత అభివృద్ధికి, యువత శక్తి సామర్ధ్యాలను మరింత నిర్మాణాత్మకంగా...
సీఐఐ బడ్జెట్ కోరికల చిట్టా
న్యూఢిల్లీ: దేశంలో ఉద్యోగాల కల్పనకు కేంద్ర బడ్జెట్‌లో మరిన్ని చర్యలు తీసుకోవాలని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ప్రభుత్వాన్ని కోరింది. సమ్మిళిత అభివృద్ధికి, యువత శక్తి సామర్ధ్యాలను మరింత నిర్మాణాత్మకంగా ఉపయోగించుకునేందుకు భారీ స్థాయిలో ఉద్యోగాల కల్పన అవసరమని స్పష్టం చేసింది. 2050 నాటికి మన దేశం 13.3 కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాల్సి ఉందని గుర్తు చేసింది. ఇందుకోసం ఏడు అంశాలతో ఒక అజెండాను సూచించింది. ప్రస్తుతం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ ఉద్యోగ, ఉపాధి పథకాలను విలీనం చేసి ఒక సమగ్ర జాతీ య ఉపాధి విధానం తీసుకురావాలని కోరింది. దీనికి తోడు కార్మిక శక్తి అధికంగా ఉండే పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, విదేశీ ఉద్యోగాల కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటు వంటి చర్యలు అవసరమని పేర్కొంది.
ప్రత్యేక ఇంటర్న్‌షిప్: దీనికి తోడు కాలేజీల్లో చదువు పూర్తి చేసిన వారి కోసం గ్రామీణ ప్రాం తాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్న్‌షిప్ పథకం ప్రారంభించాలని సూచించింది. దీని వల్ల వారికి స్వల్పకా లిక ఉపాధి లభించడంతో పాటు, వృత్తి నైపుణ్యాలు పెం పొందుతాయని సీఐఐ తెలిపింది. ఉద్యోగాల కల్పనకు కంపెనీలు చేసే ఖర్చులను ఐటీ చట్టం నుంచి మినహాయించేలా ప్రత్యేక సెక్షన్ తీసుకు రావాలని కూడా కోరింది. రాయితీల పన్ను విధానం ఎంచుకున్న కంపెనీలకూ ఈ మినహాయింపును వర్తింప చేయాలని సూచించింది.
మహిళా ఉపాధి: ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మహిళల పాత్ర తక్కువగా ఉండడంపై సీఐఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రంగాల్లో వీరి పాత్ర పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం లభిస్తుందని తెలిపింది. సామాజిక బాధ్యత కింద కంపెనీలు (సీఎ్‌సఆర్) ఖర్చు చేసే నిధులతో పారిశ్రామిక ప్రాంతాల్లో మహిళల కోసం వసతి సముదాయాలు, చిన్న పిల్లల సంరక్షణ వసతులు ఏర్పాటు చేయ డం ఇందుకు బాగా కలిసి వస్తుందని సూచించింది. తాత్కాలిక లేదా కాంట్రాక్టు ఉద్యోగులు (గిగ్ వర్కర్లు), ఓలా, ఊబర్, స్విగ్గీ వంటి ప్లాట్‌ఫామ్స్ కోసం పని చేసే తాత్కాలిక ఉద్యోగులకూ కార్మిక చట్టాలు వర్తింపచేసి, వారికీ సామాజిక భద్రత కల్పించాలని సీఐఐ సూచించింది.