Silver Growth: గోల్డ్‌కు గట్టి పోటీ ఇస్తున్న వెండి..ఏడాదిలో ఎంత పెరిగిందో తెలుసా..
ABN , Publish Date - Mar 29 , 2025 | 06:48 PM
దేశంలో బంగారం, వెండి ధరలు పైపైకి చేరుతున్నాయి. ఇదే సమయంలో వెండి రాబడులు బంగారం కంటే మించి పోవడం విశేషం. అయితే ఏ మేరకు పెరిగాయి. ఎంత లాభపడ్డాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

దేశంలో బంగారం ధరలు గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్నాయి. కానీ వెండి రేట్ల గురించి తెలిస్తే మాత్రం మీరు షాక్ అవుతారు. ఎందుకంటే వెండి ధరలు ఇప్పుడు గోల్డ్ కంటే ఎక్కువగా పెరగడం విశేషం. గోల్డ్ ధరలు అదుపు లేకుండా పెరిగి తాజాగా 92,150 రూపాయల వద్ద నిలిచాయి. అదే సమయంలో వెండి ధరలు కూడా రికార్డు స్థాయిలో పెరిగి కిలోకు 1.03 లక్షలకు చేరుకున్నాయి. అయితే ఇప్పుడు బంగారం ధర 99,000 రూపాయల వరకూ పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
బంగారాన్ని బీట్ చేసిన వెండి
2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో బంగారం 31.37% రాబడిని ఇవ్వగా, వెండి మాత్రం దాన్ని కూడా మించి 35.56% రాబడిని ఇచ్చింది. ఆర్థిక మార్కెట్లు ముఖ్యంగా నిఫ్టీ (5.29%), సెన్సెక్స్ (4.96%) తరచుగా ఈ రాబడిని ఇచ్చినప్పటికీ, బంగారం, వెండి పెట్టుబడిదారులకు అధిక లాభాలను అందించడం విశేషం. ఈ క్రమంలో మీరు వెండి మీద పెట్టుబడులు పెట్టడం, బంగారాని కంటే ఎక్కువ లాభాన్ని ఇస్తుందని నిపుణులు అంటున్నారు. మరికొన్ని రోజుల్లో వెండి ధరలు 1.25 లక్షల రూపాయలు దాటే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఈ పెరుగుదల ఎప్పటికీ కొనసాగుతుందా
గోల్డ్‌మన్ సాచ్స్, బ్యాంక్ ఆఫ్ అమెరికా (BofA) వంటి పెద్ద బ్యాంకులు బంగారం ధర లక్ష్యాన్ని పెంచాయి. గోల్డ్‌మన్ సాచ్స్ 2025 చివరిలో బంగారం ఔన్సుకు $3,100 - $3,300 లక్ష్యాన్ని పెట్టింది. BofA 2025లో బంగారం ఔన్సుకు $3,063, 2026 లో $3,350 లక్ష్యాన్ని సూచించింది. ఈ ప్రణాళికలు ప్రపంచ ఆర్థిక మార్పులకు అనుగుణంగా మార్పు చేశారు.
బంగారం, వెండి ధరలు పెరిగే కారణాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో యూరోపియన్ యూనియన్, కెనడాపై వాహన దిగుమతి సుంకాలు విధించామని ప్రకటించినపుడు, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించింది. ఈ చర్య వల్ల పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటి సురక్షితమైన ఆస్తులపై పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. దీంతోపాటు కేంద్ర బ్యాంకులు అనేక దేశాల మధ్య బంగారం కొనుగోళ్లను పెంచిన కారణంగా, బంగారం ధర 8.2% పెరిగింది. ఇవన్నీ బంగారం, వెండి ధరలను అదుపు లేకుండా పెంచాయి.
సామాన్యుల షాకింగ్..
ఈ క్రమంలో భారతదేశంలో బంగారం, వెండి పెరుగుతున్న ధరలు మరింత ఆందోళనలను సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా పండుగల సమయంలో, పెరిగిన ధరలు కేవలం సంపన్నులకే కాకుండా సామాన్య ప్రజలకు కూడా అవాంతరాలు కలిగిస్తున్నాయి. వెండి, బంగారం ధరలు రాబోయే రోజుల్లో మరింత పెరిగితే, సామాన్య ప్రజలు వాటిని కొనడానికి ఇబ్బంది పడే అవకాశం ఉంది. అయితే భవిష్యత్తులో కూడా వీటి ధరలు మరింత పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
Income Tax Changes: ఏప్రిల్ 1 నుంచి వచ్చే కొత్త పన్ను రేట్లు తెలుసుకోండి..మనీ సేవ్ చేసుకోండి..
Railway Jobs: రైల్వేలో 9,970 పోస్టులకు నోటిఫికేషన్..అప్లై చేశారా లేదా..
New Tax Rules: ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకుంటే మీకే లాభం..
Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Read More Business News and Latest Telugu News