Silver Prices: 2025లో బంగారం కంటే వెండి రేటు పెరిగే ఛాన్స్.. కారణమిదే..
ABN , Publish Date - Mar 16 , 2025 | 01:52 PM
మీరు ప్రస్తుతం బంగారంపై పెట్టుబడులు చేస్తున్నారా. అయితే ఓసారి ఈ వార్తను చదవండి. ఎందుకంటే భవిష్యత్తులో వెండి రేటు భారీగా పెరిగే అవకాశం ఉందని ఓ నివేదిక తెలిపింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

దేశంలో ప్రస్తుతం గోల్డ్ రేటు దాదాపు 90 వేల స్థాయికి చేరింది. కానీ ఓ నివేదిక మాత్రం బంగారం, కంటే వెండి రేటు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతోంది. అవును మీరు విన్నది నిజమే. అయితే ఇప్పటికే వెండి రేటు కిలోకు లక్ష రూపాయలను దాటేసింది. ప్రపంచ పెట్టుబడి సంస్థ విజ్డమ్ ట్రీ తాజా నివేదిక ప్రకారం 2025లో వెండి, బంగారం కంటే ఎక్కువ పెరుగుతుందన్నారు. ఈ క్రమంలో వెండిపై పెట్టుబడులు చేసే వారు మంచి లాభాలను పొందవచ్చని అంచనా వేసింది. అయితే దీనికి కారణాలు కూడా ఉన్నాయని తెలిపింది.
గత ఏడాది ఇలా..
విజ్డమ్ ట్రీ నివేదిక ప్రకారం బంగారం ధర 2024 చివరి నాటికి 17% పెరుగుతుందని అంచనా వేస్తే, అదే సమయంలో వెండి 23% పెరుగుతుందని అంచనా వేసింది. ఈ వృద్ధికి ప్రధానంగా పారిశ్రామిక రంగంలో వెండి వినియోగం పెరగడమేనని తెలిపింది. ఫోటోవోల్టాయిక్ (సౌర ప్యానెల్), 5G విస్తరణ, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు సహా పలు ఉత్పత్తుల్లో వెండి వినియోగం పెరగడం వల్ల, దీని డిమాండ్ రికార్డు స్థాయికి చేరుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పారిశ్రామిక రంగంలో వెండి వినియోగం
సౌర విద్యుత్ రంగం: అధిక సామర్థ్యం గల N రకం సౌర ప్యానెల్ వినియోగం పెరగడం వల్ల వెండి డిమాండ్ మరింత పెరుగుతోంది. ఈ క్రమంలో 2025లో ఫోటో వోల్టాయిక్ ఇన్‌స్టాలేషన్‌లు మరిన్ని నమోదవుతాయని అంచనా వేస్తున్నారు.
ఎలక్ట్రానిక్, టెలి కమ్యూనికేషన్ రంగం: 5G నెట్‌వర్క్ విస్తరణలో వెండి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలో 5G టవర్లు, యాంటెన్నాలు, మైక్రోచిప్ తయారీలో వెండి వినియోగం పెరుగుతోంది.
ఆటోమోటివ్ పరిశ్రమ: ఎలక్ట్రిక్ వెహికల్స్ (EVs) పెరుగుతున్న నేపథ్యంలో, వెండి వినియోగం పెరుగుతోంది. బ్యాటరీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, అధునాతన సెన్సార్‌లు, ఆటోమేటిక్ డ్రైవింగ్ టెక్నాలజీల్లో వెండి ప్రధానంగా ఉంటుంది.
డేటా సెంటర్లు, AI: అధునాతన కంప్యూటింగ్ విభాగాల్లో కూడా వెండి వినియోగం అధికమవుతోంది. AI ఆధారిత సూపర్ కంప్యూటర్లు, క్లౌడ్ స్టోరేజీ కోసం వెండి ఉపయోగం పెరుగుతోంది.
సరఫరా పరిమితులు కూడా..
వెండి నిల్వల పరిమితి కూడా దీని గణనీయమైన ధర పెరుగుదలకు కారణమవుతుంది. భూమిపై ఉన్న వెండి నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. కొన్ని ప్రముఖ వెండి మైనింగ్ కంపెనీలు ఉత్పత్తి పరిమితులను ఎదుర్కుంటున్నాయి. దీని ప్రభావం మార్కెట్‌పై కనిపిస్తోంది. ఈ క్రమంలో పెట్టుబడిదారులు అధిక ధరలకు వెండి అమ్మేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో వెండిని దీర్ఘకాలిక పెట్టుబడిగా పరిగణించాలని నిపుణులు సూచిస్తున్నారు. 2025లో పారిశ్రామిక డిమాండ్ పెరుగుతుందనే అంచనాలు ఉన్నందున దీని విలువ పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
SpaceX Crew 10: మరికొన్ని రోజుల్లో భూమిపైకి సునీతా విలియమ్స్..స్పేస్ఎక్స్ డాకింగ్ సక్సెస్..
US Strikes: నరకం చూపిస్తా.. హౌతీలకు ట్రంప్ వార్నింగ్
Terrorist Killed: ముంబై దాడుల ప్రధాన సూత్రధారి హఫీజ్ సన్నిహితుడు హతం
Delhi Air Quality: రాజధాని ప్రజలకు గుడ్ న్యూస్.. మూడేళ్లలో కొత్త రికార్డు!
Gold Silver Rates Today: తగ్గిన గోల్డ్, భారీగా పెరిగిన వెండి.. ఎంతకు చేరుకున్నాయంటే..
PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..
Read More Business News and Latest Telugu News