Share News

Stock Market: వరుసగా ఐదో రోజూ లాభాలే.. 77 వేలు దాటిన సెన్సెక్స్..

ABN , Publish Date - Mar 21 , 2025 | 03:55 PM

హెవీ వెయిట్ షేర్లతో పాటు మిడ్, స్మాల్ క్యాప్ విభాగాల్లో కొనుగోళ్లు మార్కెట్లను పరుగులు తీయిస్తున్నాయి. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ, చాలా స్టాక్స్ ఆకర్షణీయంగా ఉండడంతో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ లాభాల బాటలో పయనించాయి.

Stock Market: వరుసగా ఐదో రోజూ లాభాలే.. 77 వేలు దాటిన సెన్సెక్స్..
Stock Market

భారీ నష్టాల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు రికవరీ బాట పట్టాయి. ఇటీవల వరుస నష్టాలతో కునారిల్లిన దేశీయ సూచీలు లాభాలను ఆర్జిస్తున్నాయి. వరుసగా ఐదో రోజు కూడా లాభాలతోనే ముగిశాయి. ఆకర్షణీయంగా ఉన్న హెవీ వెయిట్ షేర్లతో పాటు మిడ్, స్మాల్ క్యాప్ విభాగాల్లో కొనుగోళ్లు మార్కెట్లను పరుగులు తీయిస్తున్నాయి. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ, చాలా స్టాక్స్ ఆకర్షణీయంగా ఉండడంతో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ లాభాల బాటలో పయనించాయి. (Business News).


గురువారం ముగింపు (76, 348)తో పోల్చుకుంటే శుక్రవారం ఉదయం 200 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత లాభాల బాట పట్టింది. మధ్యాహ్నం తర్వాత ఆ లాభాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా ఎనర్జీ, ఫైనాన్సియల్, ఆటో స్టాక్స్ బాగా లాభపడ్డాయి. దీంతో సెన్సెక్స్ చాలా రోజుల తర్వాత 77 వేలను కూడా దాటింది. చివరకు సెన్సెక్స్ 557 పాయింట్ల లాభంతో 76, 905 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 159 పాయింట్ల లాభంతో 23, 350 వద్ద స్థిరపడింది.


సెన్సెక్స్‌లో మనప్పురం ఫైనాన్స్, బీఎస్‌ఈ లిమిటెడ్, హింద్ పెట్రో, టిటాగర్ షేర్లు లాభాలను ఆర్జించాయి. జిందాల్ స్టెయిన్‌లెస్, వోల్టాస్, నాల్కో, సీజీ పవర్ షేర్లు నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 706 పాయింట్లు ఎగబాకింది. బ్యాంక్ నిఫ్టీ 530 పాయింట్ల లాభంతో రోజును ముగించింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 85.97 గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 21 , 2025 | 03:55 PM