Retirement Plan: ఒకేసారి పెట్టుబడి..30 ఏళ్లపాటు నెలకు రూ.87 వేల ఆదాయం, ఎలాగంటే..
ABN , Publish Date - Mar 13 , 2025 | 01:53 PM
ఉద్యోగుల రిటైర్మెంట్ అనంతరం ఆర్థిక భద్రత చాలా ముఖ్యం. అందుకోసం ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటారు. అందుకోసం ఎలాంటి ప్లాన్ చేయాలనే విషయాలను ఇక్కడ చూద్దాం.

పదవీ విరమణ అనేది ప్రతి ఒక్క ఉద్యోగికి వర్తిస్తుంది. కానీ దీనిని ప్లాన్ ప్రకారం చూసుకుంటే, జాబ్ తర్వాత ఇబ్బందులు లేకుండా ఉంటారు. ఆ సమయంలో మీ రోజువారీ ఖర్చుల్ని నెరవేర్చేందుకు క్రమం తప్పకుండా ఆదాయం కూడా అవసరమవుతుంది. కానీ పదవి విరమణ తర్వాత ఆదాయం సంపాదించడానికి ఎటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పటి నుంచే చిన్న మొత్తాలను సేవ్ చేయడం ద్వారా మీరు మంచి రాబడులను పొందవచ్చు. ఆ క్రమంలో నెలకు 87 వేలను 30 ఏళ్లపాటు పొందే అవకాశం ఉంటుంది. అది ఎలా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పెట్టుబడి ప్లాన్
దీని కోసం మీరు ఒకేసారి రూ. 5,00,000 SWP (Systematic Withdrawal Plan)లో పెట్టుబడి ద్వారా 30 సంవత్సరాలపాటు నెలకు రూ. 87,000 ఆదాయం ఎలా పొందవచ్చో తెలుసుకుందాం. ఉదాహరణకు మీ 25 ఏళ్ల వయస్సులో ఒకేసారి దీనిలో రూ. 5,00,000 పెట్టుబడిగా చేస్తే , మీరు ఈ పెట్టుబడిపై వార్షిక రాబడి సగటున 12% పొందే అవకాశం ఉంటుంది. ఆ క్రమంలో 30 ఏళ్లపాటు అది క్రమంగా వృద్ధి చెందుతుంది. దీంతో 30 సంవత్సరాలలో అంచనా వేసిన మూలధన లాభం రూ. 1,44,79,961కు చేరగా, పదవీ విరమణ తర్వాత మొత్తం రూ. 1,49,79,961 చేరుకుంటుంది. అంటే మీ 55 ఏళ్ల వయస్సుకు చేరుకున్నప్పుడు ఈ మొత్తం వస్తుందని చెప్పవచ్చు.
ఇక పదవీ విరమణ మొత్తంపై ఆదాయపు పన్ను: ప్రస్తుతం దీర్ఘకాలిక మూలధన లాభాల (LTCG) పన్ను రేటు 12.5% అనుకుంటే, రూ. 1,49,79,961 పై అంచనా వేసిన పన్ను రూ. 17,94,370.125 (రూ. 1,25,000 LTCG మినహాయింపుతో) అవుతుంది. పన్ను చెల్లించిన తరువాత, మిగిలిన పదవీ విరమణ నిధి రూ. 1,31,85,590.875 ఉంటుంది. ఇది SWP పెట్టుబడికి అంచనా వేసిన కార్పస్ అవుతుంది.
ప్రతి నెలా మీరు
SWP (Systematic Withdrawal Plan)లో వచ్చిన మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్ లేదా FDలో పెట్టుబడి పెట్టి, ప్రతి నెలా మీరు కావాల్సిన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ వార్షిక వృద్ధి రేటు 7% వచ్చినా కూడా రూ. 1,31,85,590.875 మొత్తంపై 30 సంవత్సరాలపాటు నెలకు రూ. 87,000 పొందవచ్చు. ఈ ప్రకారం, మీకు 85 సంవత్సరాల వయస్సు వరకు ప్రతి నెలా రూ. 87,000 ఆదాయం లభిస్తుంది. 30 ఏళ్లలో ఉపసంహరించుకున్న మొత్తం రూ. 3,13,20,000 కాగా, మిగిలిన మొత్తం రూ. 2,64,203గా ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
Gold Silver Rates Today: హోలీకి ముందే షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
BSNL Offers: రూ. 200 బడ్జెట్‌లోపు బెస్ట్ రీఛార్జ్ పాన్లు.. ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయంటే..
Read More Business News and Latest Telugu News