Share News

టెక్‌ వ్యూ : 24200 వద్ద నిలదొక్కుకోవడం కీలకం

ABN , Publish Date - Jan 06 , 2025 | 01:41 AM

నిఫ్టీ గత వారం కరెక్షన్‌తో ప్రారంభమై 23,500 కన్నా దిగజారినా రికవరీ సాధించింది. ఆ తర్వాత బలమైన పునరుజ్జీవం సాధించి వారం మొత్తం మీద 190 పాయింట్ల లాభంతో...

టెక్‌ వ్యూ : 24200 వద్ద నిలదొక్కుకోవడం కీలకం

టెక్‌ వ్యూ : 24200 వద్ద నిలదొక్కుకోవడం కీలకం

నిఫ్టీ గత వారం కరెక్షన్‌తో ప్రారంభమై 23,500 కన్నా దిగజారినా రికవరీ సాధించింది. ఆ తర్వాత బలమైన పునరుజ్జీవం సాధించి వారం మొత్తం మీద 190 పాయింట్ల లాభంతో 24,000 కన్నా పైన క్లోజయింది. ముందు వారం బేరిష్‌ ట్రెండ్‌ అనంతరం ఏర్పడిన పుల్‌బ్యాక్‌ రికవరీ ఇది. అయితే కరెక్షన్‌ అనంతరం నిలకడగా ముగియడం విశేషం. మార్కెట్‌ కనిష్ఠ స్థాయిల్లో మద్దతు పొందడం వల్ల తక్షణ ప్రమాదం నుంచి కూడా తప్పించుకుంది. స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ కోసం ఈ వారంలో బలంగా నిలదొక్కుకోవడం అవసరం. అలాగే గత వారం మిడ్‌క్యాప్‌-100 ఇండెక్స్‌ 950 పాయింట్లు, స్మాల్‌క్యాప్‌-100 ఇండెక్స్‌ 280 పాయింట్లు లాభపడ్డాయి. గత శుక్రవారం నాటి ప్రపంచ మార్కెట్‌ ధోరణులను బట్టి ఈ వారంలో పాజిటివ్‌ ధోరణికి ఆస్కారం ఉంది. ఇప్పుడు నిఫ్టీ స్వల్పకాలిక నిరోధం 24,200 వద్ద పరీక్ష ఎదుర్కొనవచ్చు.


బుల్లిష్‌ స్థాయిలు: స్వల్పకాలిక పాజిటివ్‌ ట్రెండ్‌ కోసం ప్రధాన నిరోధం 24,200 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ఆ పైన ప్రధాన నిరోధ స్థాయిలు 24500, 24800.

బేరిష్‌ స్థాయిలు: బలహీనత ప్రదర్శించినా భద్రత కోసం మద్దతు స్థాయి 24,000 వద్ద కన్సాలిడేట్‌ అయి నిలదొక్కుకోవాలి. విఫలమైతే అప్రమత్త సంకేతం ఇస్తుంది. ప్రధాన మద్దతు స్థాయి 23,800. ఇక్కడ కూడా విఫలమైతే స్వల్పకాలిక బలహీనత ఏర్పడుతుంది. మరో ప్రధాన మద్దతు స్థాయి 23,500.

బ్యాంక్‌ నిఫ్టీ: వారం మొత్తం మీద ఈ సూచీ 320 పాయింట్ల మేరకు నష్టపోయినా మద్దతు స్థాయి 50,000 కన్నా చాలా పైన ఉంది. గత వారం 51,000 వద్ద క్లోజ్‌ కావడం కనిష్ఠ స్థాయిల్లో మద్దతు సాధించిందనేందుకు సంకేతం. స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ కోసం మైనర్‌ నిరోధం 51,300 కన్నా పైన నిలదొక్కుకోవాలి. నిరోధం 51,650. ప్రధాన నిరోధం 52,000. మద్దతు స్థాయి 51,000 వద్ద నిలదొక్కుకోలేకపోతే స్వల్పకాలిక బలహీనత ఏర్పడుతుంది.

పాటర్న్‌: నిఫ్టీ ప్రస్తుతం 50, 200 డిఎంఏల వద్ద పరీక్ష ఎదుర్కొంటోంది. సానుకూలత కోసం ఇక్కడ నిలదొక్కుకోవాలి. 24,200 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద నిరోధం ఉంది. ఇక్కడ నిలదొక్కుకోవడం అవసరం. సానుకూలత కోసం 23,800 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద నిలదొక్కుకోవడం తప్పనిసరి.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం గురువారం తదుపరి మైనర్‌ రివర్సల్‌ ఉండవచ్చు.

సోమవారం

స్థాయిలు నిరోధం : 24,130, 24200

మద్దతు : 23,950, 23880

వి. సుందర్‌ రాజా

Updated Date - Jan 06 , 2025 | 01:41 AM