Share News

Twitter Icon Bird Sale: పాత ట్విట్టర్ పిట్ట ఎంత ధర పలికిందంటే

ABN , Publish Date - Mar 22 , 2025 | 01:00 PM

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ట్విటర్‌ 'పిట్ట' మనందరికీ తెలిసిందేకదా.. ఇప్పుడు సదరు పాత ట్విట్టర్ లోగో అయిన ఈ ఐకానిక్ బ్లూ బర్డ్‌ వేలం వేశారు. వేలంలో ఈ బుల్లి పిట్ట 35 వేల డాలర్లకు అమ్ముడుపోయింది. 'ఆర్‌ఆర్‌ ఆక్షన్‌' అనే సంస్థ నిర్వహించిన తాజా వేలంపాటలో ఈ ధర వచ్చింది.

Twitter Icon Bird Sale: పాత ట్విట్టర్ పిట్ట ఎంత ధర పలికిందంటే
Twitter Bird

ప్రస్తుతం ఎక్స్ (X)గా నడుస్తోన్న ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ట్విటర్‌ 'పిట్ట' మనందరికీ తెలిసిందేకదా.. ఇప్పుడు సదరు పాత ట్విట్టర్ లోగో అయిన ఈ ఐకానిక్ బ్లూ బర్డ్‌ వేలం వేశారు. వేలంలో ఈ బుల్లి పిట్ట 35 వేల డాలర్లకు అమ్ముడుపోయింది. 'ఆర్‌ఆర్‌ ఆక్షన్‌' అనే సంస్థ నిర్వహించిన తాజా వేలంపాటలో ఈ ధర వచ్చింది. ఈ ఆక్షన్ లో ఈ నీలం పిట్ట లోగో దాదాపు రూ.30 లక్షలకు అమ్ముడైంది. అయితే వేలంలో దీనిని దక్కించుకున్న వ్యక్తి ఎవరనే వివరాలను ఆయన అభ్యర్థన మేరకు సదరు ఆక్షన్ సంస్థ తెలియపర్చలేదు. అమెరికా శాన్‌ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ హెడ్‌క్వార్టర్‌ బిల్డంగ్ గోడపై ఇంతకాలం దర్శనమిచ్చిన బ్లూ బర్డ్‌ లోగో పన్నెండు అడుగుల పొడవు, తొమ్మిది అడుగుల వెడల్పు, 254 కిలోల బరువు ఉండేది.


ఇలా ఉండగా, ప్రముఖ కార్ల ఉత్పత్తి సంస్థ అయిన టెస్లా అధినేత, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు సీనియర్ అడ్వైజర్ అయిన ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్ ను 2022 అక్టోబర్ లో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అందుకోసం ఆయన ఒక్కో స్టాక్‌కు 54.20 డాలర్ల చొప్పున మొత్తంగా 44 బిలియన్‌ డాలర్లు చెల్లించారు. అప్పటి నుంచి ట్విట్టర్ లో ఎలాన్‌ మస్క్‌ అనేక మార్పులు తీసుకొచ్చారు. గతంలో ఉన్న బ్లూబర్డ్ లోగోను 'ఎక్స్‌'తో రీ బ్రాండ్‌ చేశారు. దాదాపు 75 శాతం మంది ఉద్యోగులను తొలగించడమేకాదు, కంటెంట్‌ విషయంలోనూ అనేక మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు.. ఒకప్పటి ట్విటర్‌ పాత విలువైన జ్ఞాపకమైన ఐకానిక్‌ బ్లూబర్డ్ లోగోను అమ్మేశారు.


ఇవి కూడా చదవండి:

Road Accident: ఘోర ప్రమాదం.. అడిషినల్ ఏఎస్పీ పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..

Road Accidents: లారీని ఢీకొట్టిన టూరిస్టు బస్సు.. ఎంతమంది విద్యార్థులు గాయపడ్డారంటే..

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Mar 22 , 2025 | 01:00 PM