ఇక దేశీయ యూజర్లందరికీ ‘వాట్సాప్ పే’ సేవలు!
ABN , Publish Date - Jan 02 , 2025 | 05:42 AM
ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సా్‌పకు చెందిన వాట్సాప్ పే కొత్త యూజర్ల చేరికపై పరిమితిని తక్షణమే ఎత్తివేస్తున్నట్లు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) తెలిపింది...
10 కోట్ల యూజర్ల పరిమితి ఎత్తివేత
న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సా్‌పకు చెందిన వాట్సాప్ పే కొత్త యూజర్ల చేరికపై పరిమితిని తక్షణమే ఎత్తివేస్తున్నట్లు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) తెలిపింది. తద్వారా వాట్సాప్ తన భారత యూజర్లందరికీ యూపీఐ సేవలందించేందుకు వీలు కలుగనుంది. గతంలో ఎన్‌పీసీఐ వాట్సాప్ పే యూపీఐ సేవలను దశలవారీగా విస్తరించేందుకు, గరిష్ఠంగా 10 కోట్ల మందిని మాత్రమే చేర్చుకునేందుకు అనుమతిచ్చింది. తాజాగా ఆ పరిమితిని ఎత్తివేసింది. వాట్సా్‌పకు భారత్‌లో 50 కోట్లకు పైగా వినియోగదారులున్నారు. కాగా, డిజిటల్ చెల్లింపుల సేవల్లో గుత్తాధిపత్యాన్ని నిరోధించేందుకు థర్డ్ పార్టీ యూపీఐ యాప్స్‌కు 30 శాతం మార్కెట్ వాటా పరిమితి విధించాలని ఎన్‌పీసీఐ గతంలోనే నిర్ణయించింది. దీన్ని అమలు చేసేందుకు గడువును 2026 డిసెంబరు 31 వరకు పొడిగించింది.