Share News

Tirumala Darshan: తిరుమల వెళ్తున్నారా ఈ వార్త మీకోసం మిస్సైతే మరో నెల ఆగాల్సిందే

ABN , Publish Date - Mar 23 , 2025 | 09:22 AM

తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టికెట్లను టీటీడీ మార్చి 24న విడుదల చేయనుంది. జూన్ నెలలో దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులు సోమవారం టికెట్లను బుక్ చేసుకోవల్సి ఉంటుంది.

Tirumala Darshan: తిరుమల వెళ్తున్నారా ఈ వార్త మీకోసం మిస్సైతే మరో నెల ఆగాల్సిందే
Tirumala

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శుభవార్త చెప్పింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300 టికెట్) జూన్ 2025 కోటాకు సంబంధించిన టికెట్ల విడుదల తేదీని ప్రకటించింది. జూన్ 2025 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించిన టికెట్లు రేపటి నుంచి అనగా మార్చి 24, సోమవారం ఉదయం 10 గంటల నుంచి అందుబాటులోకి రానున్నట్లు టీటీడీ ప్రకటించింది. అవసరమైన భక్తులు టీటీడీ వెబ్‌సైట్ కు వెళ్లి ఈ టికెట్లు బుక్ చేసుకోవాల్సిందిగా సూచించింది.


తిరుమల తిరుపతిలో వసతి కోటా జూన్ 2025కు సంబంధించిన టికెట్లను కూడా మార్చి 24న అందుబాటులో ఉంచనుంది. సోమవారం (మార్చి 24) మధ్యాహ్నం 3 గంటల నుంచి తిరుమల, తిరుపతిలో జూన్ నెలలో వసతి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. కేవలం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం లేదా ఇప్పటికే ఇతర దర్శనం టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే వసతి గదులు బుక్ చేసుకునే అవకాశం ఉంటుది. రూ.100. రూ.300 వసతి గదులను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతుంది. కేవలం రూ.300 టికెట్లు కలిగిన భక్తులకు తిరుమల, తిరుపతిలో కొన్ని గదులను రిజర్వు చేసి పెడుతుంది.


స్థానిక ఆలయాల కోటా

టీటీడీ స్థానిక ఆలయాల సేవా కోటా ఏప్రిల్ 2025 కు సంబంధించిన టికెట్ల బుకింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించింది. ఈ సేవా టికెట్లను మార్చి 25, మంగళవారం ఉదయం 10 గంటల నుంచి వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచనుంది. ఆసక్తి కల భక్తులు.. టీటీడీ వెబ్‌సైట్‌లో ఆయా సేవలకు సంబంధించిన టికెట్లను బుక్ చేసుకోవాలని ఆలయ అధికారులు సూచించారు. అలానే వృద్ధులు , దివ్యాంగుల కోటాకు సంబంధించి జూన్ 2025 టికెట్ల బుకింగ్ మార్చి 22, శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసినట్లు టీటీడీ ప్రకటించింది.


బుకింగ్ ఇలా

ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్‌ విధానంలో టీటీడీ కొన్నేళ్ల క్రితం కొన్ని మార్పులు తీసుకొచ్చింది. దీంతో ఎక్కువ మది భక్తులకు టికెట్లు లభించేలా బుకింగ్ విధానాన్ని మార్చింది. ఎవరైతే టికెట్లు బుక‌ చేసుకోవాలనుకుంటున్నారోవారు వెబ్‌సైట్‌కు లాగిన్ కాగానే మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఎంటర్ చేసిన తర్వాత ఒక ఓటీపీ వస్తుంది. సరైన వన్ టైమ్ పాస్‌వర్డ్ ఎంటర్ చేశాక రెండు నుంచి మూడు నిమిషాలు వెయిట్ చేయాలని సూచిస్తుంది. నిరీక్షణ సమయం అయిన వెంటనే ఏయే తేదీల్లో దర్శనం టికెట్లు ఖాళీ ఉన్నాయో చూపిస్తుంది. మనకు కావల్సిన తేదీని ఎంపిక చేసుకుని భక్తుల సంఖ్యను ఎంటర్ చేయాలి. ఒక లాగిన్‌పై ఆరుగురు భక్తులకు అవకాశం ఉంటుంది. భక్తుల పేర్లు, లింగం, ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ అడుగుతుంది. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుతో పాటు యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

IPO Calender: వచ్చే వారం స్టాక్ మార్కెట్‌కు కొత్త జోష్.. 4 ఐపీవోలు, 5 లిస్టింగ్స్

ఇన్‌పుట్‌ సర్వీస్‌ డిస్ట్రిబ్యూటర్‌.. కొత్త నిబంధనలు?

Gold and Sliver Prices: పైపైకి ఎగబాకుతున్న గోల్డ్ రేటు.. మార్కెట్ ఎలా ఉందంటే..

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Mar 23 , 2025 | 09:22 AM