Historical Temples: జీవితంలో ఒకసారైనా సందర్శించాల్సిన ఆలయాలు ఏమిటో తెలుసా..
ABN , Publish Date - Mar 28 , 2025 | 08:13 AM
జీవితంలో ఒకసారైనా సందర్శించాల్సిన కొన్ని ప్రముఖ ఆలయాలు భారత దేశంలో ఉన్నాయి. ఆయా ఆలయాలను సందర్శించిన భక్తులకు శాంతి, ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తాయి. ఆ ఆలయాలు ఏంటో తెలుసుకుందాం...

Historical Temples: భారతదేశం (India) ఆధ్యాత్మికత (Spirituality), సంస్కృతి (Culture), చరిత్రల సమ్మేళనంగా నిలుస్తుంది. ఇక్కడి ఆలయాలు (Temples) కేవలం పూజా స్థలాలు మాత్రమే కాకుండా, వాస్తుకళా వైభవం, సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలు. జీవితంలో ఒకసారైనా సందర్శించాల్సిన కొన్ని ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. ఆయా ఆలయాలను సందర్శించిన భక్తులకు (Devotees) శాంతి, ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తాయి. ఆ ఆలయాలు ఏంటో తెలుసుకుందాం...
Also Read..: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు
తిరుపతి..
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచంలో అత్యధిక భక్తులు సందర్శించే క్షేత్రాల్లో ఒకటి. విష్ణుమూర్తి అవతారమైన వెంకటేశ్వరునికి సమర్పితమైన ఈ ఆలయం సప్తగిరులపై ఉంది. ఇక్కడి శ్రీవారిని దర్శనం చేసుకుంటే మనసులో కోరికలను నెరవేరుతాయని, మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలను నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. శ్రీవారి ముగ్ధ మనోహర రూపాన్ని చూసి తరిస్తూ ఉంటారు. దర్శనం అనంతరం శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరించి.. ఆ దేవదేవుణ్ని మరోసారి దర్శించుకున్నంత అనుభూతికి లోనవుతూ ఉంటారు. తిరుమల శ్రీవారి లడ్డూకు భక్తులు అంత ప్రాధాన్యం ఇస్తారు. ఇంట్లో శ్రీవారి లడ్డూ ఉంటే ఎంతో పుణ్యమని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. తిరుమల లడ్డూకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనసులో అంతటి ప్రత్యేక స్థానం ఉంది.
కాశీ విశ్వనాథ ఆలయం
వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం శివభక్తులకు పవిత్ర స్థలం. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఇది గంగానది తీరంలో ఉంది. ఈ క్షేత్ర దర్శనం మరణానంతరం ముక్తిని ఇస్తుందని నమ్మకం. దీని చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక వాతావరణం భక్తులను ఆకర్షిస్తుంది. ఆధ్యాత్మికంగా విశ్వనాథ దేవాలయానికి ఎప్పటినుంచో చాలా ప్రాధాన్యం ఉంది. కానీ, దీని గురించి చారిత్రక ఆధారాలు చాలా తక్కువగా అందుబాటులో ఉన్నాయి. కాశీ విశ్వేశ్వరుడి దర్శనానికి చాలా ప్రాధాన్యత ఉంది. ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా కాశీకి అంతా వెళ్తున్నారు. వారణాసిలో అడుగుపెడితే చాలు.. మనస్సంతా ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోతుంది. ఎన్ని టెన్షన్స్ ఉన్నా.. వాటిని మర్చిపోయేలా చేస్తుంది కాశీ క్షేత్రం.
గోల్డెన్ టెంపుల్..
గోల్డెన్ టెంపుల్.. ఈ పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది పంజాబ్‌లోని అమృత్‌సర్ దేవాలయం. సిక్కుల ప్రఖ్యాత ప్రార్థనా స్థలం అమృత్సర్‌లోని గోల్డెన్ టెంపుల్ ఇది సిక్కు మతస్థులకు అత్యంత పవిత్రమైనది. బంగారు నిర్మాణంతో కూడిన ఈ ఆలయం సరోవరం మధ్యలో ఉండి, సమానత్వ సందేశాన్ని చాటుతుంది. ఇక్కడ అందరికీ ఉచితంగా అందే లంగర్ సేవ దీని ప్రత్యేకత. ఈ టెంపుల్‌ను అన్ని మతాలకు చెందివారు వెళ్లి దర్శించుకుంటారు.
మీనాక్షి ఆలయం..
తమిళనాడు రాష్ట్రం ఆలయాలకు, సాంస్కృతిక వైభవానికి పెట్టింది పేరు. అలాంటి తమిళనాడులో మదురైనందు వెలసిన పుణ్యక్షేత్రం మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం. ఈ దేవాఆలయం ద్రావిడ శైలి వాస్తుకళకు ప్రసిద్ధి చెందింది. పార్వతి (మీనాక్షి), శివునికి (సుందరేశ్వరర్) అంకితమైన ఈ క్షేత్రం రంగురంగుల గోపురాలతో ఆకట్టుకుంటుంది. దీని శిల్పకళ, వార్షిక ఉత్సవాలు సందర్శకులను అబ్బురపరుస్తాయి. పూరీలోని జగన్నాథ ఆలయం చార్ ధామ్‌లలో ఒకటిగా విష్ణుమూర్తి భక్తులకు కేంద్రం. ఇక్కడ జరిగే రథయాత్ర ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
కేదార్‌నాథ్ ఆలయం..
భారత్‌లోని అత్యంత పవిత్రమైన యాత్రలలో ఒకటైన చార్ ధామ్ యాత్ర.. హిమాలయాల్లోని కేదార్‌నాథ్ ఆలయం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి.. చార్ ధామ్‌లలో భాగం. శివునికి సమర్పితమైన ఈ క్షేత్రం చేరుకోవడానికి కఠిన యాత్ర అవసరం, అది భక్తులకు ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది. జమ్మూ కాశ్మీర్‌లోని వైష్ణో దేవి ఆలయం శక్తి రూపమైన వైష్ణవి దేవికి అంకితం. త్రికూట పర్వతాల్లో 13 కి.మీ. ట్రెక్కింగ్‌తో చేరుకునే ఈ ఆలయం భక్తుల విశ్వాసాన్ని పరీక్షిస్తుంది. కాగా 2025 సంవత్సరానికి సంబంధించిన తేదీలను ప్రకటించారు. ఈ యాత్రలో భాగమైన కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు మే 2న ఉదయం 7 గంటలకు భక్తుల కోసం తెరుస్తారు. శ్రీ బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ సీఈవో విజయ్ ప్రసాద్ తప్లియాల్ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ ఆలయాలు భారతదేశ వైవిధ్యం, ఆధ్యాత్మిక గాఢతను ప్రతిబింబిస్తాయి. ఇవి సందర్శించడం ద్వారా భక్తులు శాంతిని, సాంస్కృతిక అవగాహనను పొందుతారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అమెరికాలో మకార్తీ భూతం మళ్లీనా?
కక్ష సాధించే వాడినైతే.. కుటుంబమంతా జైల్లోనే!
For More AP News and Telugu News